Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నైజీరియాను కుదిపిస్తున్న వరదలు - ఇప్పటికే 600 మంది మృతి

Advertiesment
floods
, మంగళవారం, 18 అక్టోబరు 2022 (10:28 IST)
నైజీరియా దేశంలో గత కొన్ని రోజులుగా కుంభవృష్ఠి కురుస్తుంది. దీంతో ఆ దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు 600 మందికిపైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంతా వర్షాలు కురిశాయి. దీంతో 13 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. ఈ వర్షాలు వచ్చే నెలాఖరు వరకు కొనసాగుతాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.  
 
గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న వర్షాలతో దేశం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా ఏకంగా 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇళ్లు కొట్టుకుపోవడం, ఇళ్లు మునిగిపోవడం కారణంగా 13 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది. పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లకపోవడంతోనే ప్రాణనష్టం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
 
వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడంతో ప్రజలు ఇప్పటికైనా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని నైజీరియా మంత్రి సదియా ఉమర్ ఫరూఖ్ కోరారు. ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి ఎలన్ మస్క్.. పేరు.. 'పై ఫోన్' ధరెంతంటే?