Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నకొడుకును హతమార్చిన సినీ కథా రచయిత.. మత్తు పదార్థాలకు బానిసై?

మత్తు పదార్థాలకు బానిసై తరచూ డబ్బు కోసం వేధించడంతో తమిళనాడుకు చెందిన ఓ సినీ కథా రచయిత కన్నకొడుకునే హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారం

Advertiesment
కన్నకొడుకును హతమార్చిన సినీ కథా రచయిత.. మత్తు పదార్థాలకు బానిసై?
, శుక్రవారం, 11 మే 2018 (11:53 IST)
మత్తు పదార్థాలకు బానిసై తరచూ డబ్బు కోసం వేధించడంతో తమిళనాడుకు చెందిన ఓ సినీ కథా రచయిత కన్నకొడుకునే హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన సౌందరపాండి (56) ఆపై సినీ కథా రచయితగా మారారు. సీవలపెరి పాండి (1994) అనే సినిమాకు కథ అందించారు. ఈయన్ని సౌబా అని పిలుస్తారు. 
 
భ్రూణ హత్యలపై అర్థవంతమైన కథలు రాసిన ఈయన విభేదాల కారణంగా భార్య లతాపూర్ణం (55)కు దూరమయ్యారు. కానీ వీరి కుమారుడు విపిన్ మాత్రం.. తల్లిదండ్రుల వద్ద కొద్దికొద్ది రోజులు వుంటున్నాడు. పీజీ పూర్తి చేసిన వీరి తనయుడు విబిన్ (27) కొంతకాలంగా ఖాళీగానే ఉంటున్నాడు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి అతను కనిపించకుండా పోవడంతో ఎస్ఎస్ పోలీస్ స్టేషన్‌లో లతాపూర్ణం ఫిర్యాదు చేశారు.
 
దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకిచ్చే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి సౌందరపాడి కొనిచ్చిన లగ్జరీ కారును విబిన్ ఆయనకు తెలియకుండా అమ్మేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని పోలీసులకు లత చెప్పడంతో పోలీసులు ఆరా తీశారు. ఈ విచారణలో కొడుకును తానే హత్య చేసినట్టు సౌందరపాండి అంగీకరించారు.
 
విపిన్‌కు తానే కారు కొనిచ్చానని, మత్తు పదార్థాలకు బానిసైన విబిన్‌ డబ్బులు కోసం తనను తరచూ వేధించడంతోపాటు కారు కూడా అమ్మేశాడని సౌందరపాండి పోలీసులకు తెలిపాడు. కన్నకొడుకు ప్రవర్తన సరిగ్గా లేదని.. కారు విషయంలో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వివాదం చోటుచేసుకుందని.. ఆ కోపంలో సుత్తితో దాడి చేయడంతో విబిన్ మరణించినట్లు తెలిపారు. విబిన్‌ను హత్య చేసిన తర్వాత అమ్మాయనాయికనూర్ సమీపంలోని ఫాంహౌజ్‌లో దహనం చేసినట్టు సౌందరపాండి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో యువతుల కారు బీభత్సం