Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్లమెంటులో ఇకపై ఈ పదాలు వాడరాదు.. బుక్‌లెట్ రిలీజ్

Advertiesment
parliament
, గురువారం, 14 జులై 2022 (15:06 IST)
ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అదేసమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాల నుంచి కొన్ని పదాలను ఉపయోగించకుండా కట్టడి చేశారు. ఇందుకోసం ఓ బుక్‌లెట్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇకపై పార్లమెంట్‌లో వాడకూడని పదాలతో ఓ బుక్‌లెట్ రిలీజ్ చేయగా, ఇందులో అవినీతిపరుడు, అసమర్థుడు, సిగ్గులేదు, ధోకే‌బాజ్ వంటి వాటిని అన్‌పార్లమెంటరీ పదాలుగా గుర్తించారు. ఆ మాటలు వాడిన వారిపై చర్యలకు ఉభయసభల సభాపతులకు పూర్తి అధికారం ఇచ్చారు. 
 
అంతేకాకుండా, కొన్ని ఇంగ్లీష్ పదాలను కూడా వాడకుండా నిషేధించారు. ఇలాంటి వాటిలో బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, కరప్ట్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్‌ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, అన్‌ట్రూ, కోవిడ్‌ స్ప్రెడర్, స్నూప్‌గేట్‌ వంటివి ఉన్నాయి. 
 
అలాగే, చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్, గూన్స్, అప్‌మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో ఉన్నాయి. 
 
వివిధ సందర్భాల్లో దేశంలోని చట్ట సభలు, కామన్వెల్త్ దేశాల పార్లమెంట్లలో స్పీకర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన పదాలను బుక్ లెట్లో చేర్చారు. అయితే, ఇలాంటి పదాలను వాడిన సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అధికారం లోక్‌సభ, రాజ్యసభ అధిపతులకే ఉంటుందని లోక్‌సభ సెక్రటేరియట్ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఓయో రూమ్స్‌ రెడీ