Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఎందుకు జరుపుతారంటే?!

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఎందుకు జరుపుతారంటే?!
, గురువారం, 21 అక్టోబరు 2021 (09:08 IST)
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. 
 
మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవి.

1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. 
 
ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ.
 
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. పోలీసులు త్యాగాలు 
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు  మరువలేము, వారిని స్మరించుకోవడం అందరి బాధ్యతనేర పరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామమంమన కళ్ల ముందు నిత్యం ఏ కష్టం కలిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీసు, ఖాళీ డ్రస్‌ ఖరుకుదనం ఉన్న వెనుకాల ఉన్నది మనిషే కాబట్టి వారందరికీ మర్యాద, గౌరవం, విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 
 
నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నాం వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకిత చేసిన వారందరికీ పాదాభివందనం.

అసువులు బాసిన భరతమాత ముద్దు బిడ్డలందరికీ జోహార్లు, ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతిభద్రతల పరిరక్షణ కోసం కాపలా ఉంటారు, ఎండా, వాన, పగలు, రాత్రి అని తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ పబ్బాల్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకు అందునా ప్రాణాలని ఫణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులుచేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. 
 
భవిష్యత్‌లో పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకురాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం ప్రధాన ఉద్దేశం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేటి నుంచి పోలీసులకు వీక్లి ఆఫ్ అమలు :సీఎం జగన్