Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారు : సీఎం స్టాలిన్ ప్రశ్న

Advertiesment
mk stalin

ఠాగూర్

, మంగళవారం, 4 మార్చి 2025 (08:27 IST)
కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని భావిస్తుంది. కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు మాత్రం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త జాతీయ విద్యా విధానం అమలు విషయంలో వివాదం కొనసాగుతుంది. అదేసమయంలో సీఎం స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయనపై పలువురు రాజకీయ నేతలు, విద్యావేత్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారందరికీ స్టాలిన్ ఓ ప్రశ్న సంధించారు. 
 
తమిళనాడు రాష్ట్రంలోని విద్యార్థులకు మూడో భాషను నేర్చుకోవడానికి ఎందుకు అనుమతించడం లేదని కొంతమంది తమను అడుగుతున్నారని, మరి ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతారో చెప్పడం లేదన్నారు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్టయితే ఇక్కడ దక్షిణాదిలో మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. 
 
ఆలస్యం చేయొద్దు.. అర్జెంటుగా పిల్లలను కనేయండి.. 
 
కొత్త దంపతులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ పిలుపునిచ్చారు. పెళ్లయిన మరుక్షణం నుంచే పిల్లన్నికనే పనిలో నిమగ్నం కావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతుందని, అందువల్ల ఇపుడు పిల్లలను కనాలని, మనం జనభా పెంచుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కొత్తగా పుట్టే పిల్లలకు కేవలం తమిళంలోనే పేర్లు పెట్టాలని, తద్వారా సెమ్మొళి తమిళంకు మరింత గౌరవం చేకూర్చినట్టు అవుతుందన్నారు. 
 
సోమవారం ఆయన నాగపట్టణం జిల్లా పర్యటనలో భాగంగా, ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి ప్రసంగించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేందుకు కొత్త జంటలు త్వరగా పిల్లలు కనాలని కోరారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతాయని అన్నారు. 
 
అందువల్ల రాష్ట్ర నష్టపోకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు తక్షణమే పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కొత్త జంటలు పిల్లలు కనేందుకు సమయం తీసుకోవాలని గతంలో తాను చెప్పానని, ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయం మార్చుకుంటున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైజింగ్ క్రికెట్ స్టార్ యశస్వి జైస్వాల్‌తో భాగస్వామ్యం చేసుకున్న హెర్బాలైఫ్ ఇండియా