Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Advertiesment
mk stalin

ఠాగూర్

, సోమవారం, 3 మార్చి 2025 (19:59 IST)
కొత్త దంపతులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ పిలుపునిచ్చారు. పెళ్లయిన మరుక్షణం నుంచే పిల్లన్నికనే పనిలో నిమగ్నం కావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతుందని, అందువల్ల ఇపుడు పిల్లలను కనాలని, మనం జనభా పెంచుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కొత్తగా పుట్టే పిల్లలకు కేవలం తమిళంలోనే పేర్లు పెట్టాలని, తద్వారా సెమ్మొళి తమిళంకు మరింత గౌరవం చేకూర్చినట్టు అవుతుందన్నారు. 
 
సోమవారం ఆయన నాగపట్టణం జిల్లా పర్యటనలో భాగంగా, ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి ప్రసంగించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేందుకు కొత్త జంటలు త్వరగా పిల్లలు కనాలని కోరారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతాయని అన్నారు. 
 
అందువల్ల రాష్ట్ర నష్టపోకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు తక్షణమే పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కొత్త జంటలు పిల్లలు కనేందుకు సమయం తీసుకోవాలని గతంలో తాను చెప్పానని, ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయం మార్చుకుంటున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ విస్కీ ధర రూ. 10.5 లక్షలు: భారతదేశంలోనే అత్యంత పురాతనమైన అరుదైన సింగిల్ మాల్ట్‌