Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

Advertiesment
gold

ఠాగూర్

, గురువారం, 1 మే 2025 (22:46 IST)
విడాకుల కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి సమయంలో వధువుకు పుట్టింటివారు ఇచ్చే బంగారు నగలు, నగదును ఆమె ఆస్తిగా పేర్కొంది. ఒకవేళ ఆమె విడాకులు తీసుకుంటే మాత్రం వాటిని తిరిగి ఇచ్చేయాల్సిందేనంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకుల కేసు విచారణలో భాగంగా తన బహుమతులు, ఆభరణాలు తిరిగి ఇప్పించాలంటూ ఆమె చేసిన అభ్యర్థనను కింది కోర్టు తిరస్కరించింది. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. 
 
ఎర్నాకుళంలోని కలమస్సేరికి చెందిన ఓ మహిళకు 2010లో వివాహం జరిగింది. ఆ సమయంలో తన కుటుంబం, బధువులు నుంచి 71 సవర్ల బంగారం అందిందని, బంగారన్నంతా భద్రపరుస్తామన్న నెపంతో అత్తింటివారే తమ వద్ద దాచిపెట్టుకున్నారని తెలిపారు. అయితే, అదనపు కట్నం కింద తన భర్త అడిగిన రూ.5 లక్షలు ఇవ్వకపోవడంతో తమ బంధం బీటలు వారిందని కోర్టుకు తెలిపింది. 
 
తన తల్లిదండ్రులు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఆ బంగారాన్ని గొనుగోలు చేసిన విషయాన్ని ఆమె కోర్టులో నిరూపించుకోగలిగారు. వాదోపవాదాలు ఆలకించిన కేరళ హైకోర్టు... ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. విడాకుల ప్రక్రియలో భాగంగా మిగిలినదిపోనూ 59.5 సవర్ల బంగారం లేక దాని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నగదు చెల్లించాలని ఆమె భర్త కుటుంబాన్ని ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు