సునంద్ పుష్కర్‌కు విషమిచ్చి చంపేశారా? డీఎన్ఏ రిపోర్టు ఏం చెపుతోంది?
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్‌కు విషమిచ్చి చంపేసినట్టు వార్తలు వస్తున్నాయి. సునంద పుష్కర్ గత 2014 జనవరి 17వ తేదీన ఢిల్లీలోని లీలా ప్యాలెస్
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్‌కు విషమిచ్చి చంపేసినట్టు వార్తలు వస్తున్నాయి. సునంద పుష్కర్ గత 2014 జనవరి 17వ తేదీన ఢిల్లీలోని లీలా ప్యాలెస్ నక్షత్ర హోటల్‌లో అనుమానాస్పదరీతిలో చనిపోయిన విషయం తెల్సిందే.
ఆమెపై విష ప్రయోగం జరిగిందని, ఈ విషయం దర్యాప్తు అధికారులకు కూడా తెలుసని డీఎన్ఏ వార్తా సంస్థ సంచలన వార్తా కథనాన్ని ప్రచురించింది. అప్పటి డిప్యూటీ పోలీస్ కమిషనర్ బీఎస్ జైస్వాల్ ఈ కేసులో ప్రాథమిక నివేదిక రూపొందించారని పేర్కొంది. విష ప్రయోగం వల్లే ఆమె మృతి చెందినట్టు జైస్వాల్ నివేదికలో ఉందని వివరించింది.
సునంద శరీరంపై 15 గాయాలున్నాయని, చేతిపై ఉన్న పదో నంబరు గాయం నుంచి ఇంజక్షన్ ఇచ్చారని తెలుస్తోందని జైస్వాల్ రూపొందించిన ప్రాథమిక నివేదికలో ఉందని పేర్కొంది. 12 నంబరు గాయంపై పంటిగాటు ఉందని, అల్ఫ్రాజోలం ప్రయోగం వల్లే ఆమె మృతి చెందినట్టు భావిస్తున్నామని జైస్వాల్ తన నివేదికలో పేర్కొన్నట్టు డీఎన్ఏ రిపోర్టు వెల్లడించింది.