Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కమ్యూనిస్టు కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ ఇక లేరు

Advertiesment
VS Achuthanandan,

ఠాగూర్

, సోమవారం, 21 జులై 2025 (18:43 IST)
కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ సోమవారం కన్నుమూశారు. ఆయనకు 101 సంవత్సరాలు. గత నెల 23వ తేదీన గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎంగా పని చేసిన విషయంతెల్సిందే. 
 
అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. 1923 అక్టోబరు 20వ తేదీన కేరళలో వెనుకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్, లెనిన్, స్టాలిన్, మావోల జీవితాలతో పాటు ప్రపంచ కమ్యూనిస్ట్ చరిత్రలో అనేక కీలక ఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేత.  
 
1940లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యారు. స్వాతంత్ర్యానికి ముందున్న ట్రావెన్‌కోర్ సంస్థానంలో భాగస్వాములపై పోరాటంలో భాగంగా జైలుకెళ్లడంతో ఆరంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ప్రజానేతగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. 1967లో సీపీఐ జాతీయ కౌన్సిల్ వదిలేసి సీపీఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1967 నుంచి 2016 దాకా కేరళ అసెంబ్లీకి ఎన్నికై ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా, మూడుసార్లు విపక్షనేతగా వ్యవహరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెలాక్సీ వాచ్ 8 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్‌లను ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా