వీధి కుక్కలు. ఈ కుక్కలు ఎప్పుడు ఎలా దాడి చేస్తాయో ఎవ్వరికీ తెలియడంలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వీధికుక్కలు ఇద్దరు చిన్నారులపైకి దాడి చేసేందుకు మీదకు వచ్చాయి. అలా రావడంతో ఓ చిన్నారి వెనుదిరిగి పరుగులు తీసింది. ఐతే చిన్నబాబు మాత్రం కుక్కలకు ఎదురుగా నిలబడి వాటిని ఎదిరించాడు. దాంతో అవి తోక ముడిచాయి. మరోవైపు వెనుదిరిగి ఇంటికి వెళ్లిన పాప కాస్త విషయాన్ని పెద్దవారికి చేరవేసింది. వారంతా బయటకు రావడంతో ఆ చిన్న పిల్లవాడు కూడా సురక్షితంగా కుక్కల దాడి నుంచి బైటపడ్డాడు.
ఇదిలావుంటే కుక్క కాటు సంఘటనలు ఆందోళనకరమైన రీతిలో పెరుగుతూ పోతున్నాయి. దీనితో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్ స్టాండ్‌లు, డిపోలు, రైల్వే స్టేషన్‌ల ప్రాంగణాల నుండి వీధి కుక్కలను వెంటనే పట్టుకుని వాటికి జంతువుల జనన నియంత్రణ నియమాలకు అనుగుణంగా తగిన స్టెరిలైజేషన్, టీకాలు వేసిన తర్వాత నిర్దేశిత ఆశ్రయాలకు వాటిని తరలించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
ఎనిమిది వారాల వ్యవధిలో స్థితి సమ్మతి ధృవీకరణ పత్రాలతో తమ ఆదేశాలను భారతదేశం అంతటా ఏకరీతిలో అమలు చేయాలని పేర్కొంటూ, న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్ వి అంజరియాలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇంకా చెబుతూ... అలా తీసుకెళ్లిన వీధి కుక్కలను వాటిని తీసుకెళ్లిన అదే ప్రదేశానికి తిరిగి వదలకూడదు అని పేర్కొంది.
అలాంటి వీధి కుక్కలను వాటిని తీసుకెళ్లిన అదే ప్రదేశానికి విడుదల చేయకూడదని మేము ఉద్దేశపూర్వకంగా ఆదేశిస్తున్నాము. ఎందుకంటే వాటిని తిరిగి ఇదివరకటి ప్రదేశంలోనే విడిచిపెడితే సమస్య పరిష్కారంలో ఎలాంటి మార్పు వుండదు అని వ్యాఖ్యానించింది. వీధి కుక్కలను తొలగించే బాధ్యత సంబంధిత అధికార పరిధికి చెందిన మున్సిపల్ శాఖలపై వుంటాయి.