Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16 నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి వెల్లడి

Advertiesment
16 నుంచి చిన్నారులకు వ్యాక్సినేషన్ : కేంద్ర మంత్రి వెల్లడి
, సోమవారం, 14 మార్చి 2022 (16:53 IST)
ఈ నెల 16వ తేదీ నుంచి 12 -14 సంవత్సరాల వయుస్సున్న చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేయనున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
కరోనా వైరస్ బారినపడకుండా, ఒకవేళ ఈ వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు వీలుగా పెద్దలకు తొలుత కరోనా టీకాలు వేశారు. ఆ తర్వాత 15 -18 యేళ్ల మధ్య ఉన్న చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 12-14 యేళ్లు ఉన్న చిన్నారులకు ఈ టీకాలు వేయనున్నట్టు తెలిపారు. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు 12-14 యేళ్ల మధ్య పిల్లలతో పాటు 60 యేళ్ళకు పైబడిన వాళ్ళకి ప్రికాషన్ డోసు ప్రక్రియను ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. దేశంలో కొన్ని నెలలుగా సాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 1,79,91,57,4876 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ ఉంది : బ్రదర్ అనిల్