కరోనా నుంచి రక్షణ కోసం 12-17 ఏళ్ల వయసు పిల్లలకు కోవావాక్స్‌ను వినియోగించేలా డీసీజీఐ బుధవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులైన సీరం ఇన్సిస్టిట్యూట్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
ఇప్పటికే 15 ఏళ్ల పైబడ్డ పిల్లలకు వ్యాక్సినేషన్‌కు ఇప్పటికే అనుమతి ఇచ్చేసిన కేంద్ర ప్రభుత్వం.. 15 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్‌కు మాత్రం ఎలాంటి ప్రణాళికను ప్రకటించలేదు.
కానీ ప్రస్తుతం కోవావాక్స్‌ను 12-17 ఏళ్ల పిల్లలకు వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో ఈ గ్రూప్ వయసు పిల్లల వ్యాక్సినేషన్‌పై త్వరలోనే కేంద్రం ప్రకటన చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.