Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి నుంచి ఆ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం (యూసీసీ) అమలు

Advertiesment
uttarakhand

ఠాగూర్

, సోమవారం, 27 జనవరి 2025 (10:10 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి చట్టా(యూసీసీ)న్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ రాష్ట్రంలో 2025 జనవరి 27వ తేదీ సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ దామి ఆదివారం ప్రకటించారు. దీంతో దేశంలో యూపీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది.
 
యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఎం వెల్లడించారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ మేరకు సీఎం ధామి ఓ ప్రకటన విడుదల చేశారు. 'యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తాం' అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
ఈ యూసీసీ చట్టంలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, 
* వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది.
* మతాలతో సంబంధం లేకుండా ఉత్తరాఖండ్‌లో లింగ సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది.
* సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. 
* సహజీవనం చేస్తున్నవారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
* సైనికులు, వాయుసేనలో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నౌకాదళంలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు.
* అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. 
* అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు.
* హలాల్ విధానంపై నిషేధం విధించారు.
 
యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ సర్కారు పెద్ద కసరత్తు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని 2022 మే 27న నియమించింది. అది యేడాదిన్నర పాటు కసరత్తు చేసి సమగ్రమైన యూపీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. 2004 ఫిబ్రవరి 2న యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది. 
 
ఈ బిల్లును 2024 ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదించింది. నెలరోజుల తర్వాత ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం లభించింది. తదుపరిగా యూపీసీ బిల్లు అమలుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు మాజీ సీఎస్ శత్రుఘ్నసింగ్ సారధ్యంలో నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ 2024 ఆఖరులో రాష్ట్ర సర్కారుకు నివేదికను సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఉత్తరాఖండ్ కేబినెట్ యూసీసీ అమలుకు తేదీని నిర్ణయించే అధికారాన్ని సీఎం ధామికి కట్టబెడుతూ తీర్మానం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్‌స్టాల్ పరిచయం.. ఇద్దరిదీ ఒకే సమస్య.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.. (Video)