Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవంబర్ 30 వరకు అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు పొడిగింపు... అవేంటో తెలుసా?

Advertiesment
నవంబర్ 30 వరకు అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు పొడిగింపు... అవేంటో తెలుసా?
, బుధవారం, 28 అక్టోబరు 2020 (07:58 IST)
అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను నవంబర్ 30వరకు పొడగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అన్‌లాక్ 5.0 లో భాగంగా అక్టోబర్ నెలకు గాను ప్రకటించిన సడలింపులు.. నవంబర్ 30 వరకు వర్తిస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది.

కోవిడ్ పై పోరాటంలో భాగంగా ప్రధాన మోడీ ప్రారంభించిన 'జన్ ఆందోళన్' కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు అవుతూ ప్రతిజ్ఞకు పూనుకోవాలని హోంశాఖ విజ్ఞప్తి చేసింది. లాక్‌డౌన్ ఎత్తివేయడం అంటే కోవిడ్ ముప్పు తొలగినట్టు కాదని, వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పండగల సమయంలో మరింత అప్రమత్తత అవసరమని ప్రధాని మోడీ ఇటీవల తన సందేశంలో ప్రజలకు సూచించారు.
 
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్లినపుడు ఇతరులకు కనీసం ఆరు అడుగుల భౌతికదూరాన్ని పాటించడం వంటివి తప్పనిసరిగా పాటించాలని సూచించింది. వీటికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యేలా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది.
 
గత నెల అన్‌లాక్ 5 సడలింపులను ప్రకటించిన కేంద్రం అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు అనుమతించింది. అయితే దీనిపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యాసంస్థలు అనుమతి తీసుకోవాలని చెప్పింది.

విద్యార్థుల హాజరు విషయంలో పట్టుపట్టకూడదని కండిషన్ పెట్టింది. ఇదే సమయంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇదివరకే పలు సూచనలు చేసింది.   
 
కోవిడ్ సాధారణ నివారణ చర్యలు: 
కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి సాధారణ ప్రజలు తీసుకునే ప్రజారోగ్య చర్యలన్నింటినీ ఇక్కడ కూడా అందరూ (పార్కులు, సినిమా థియేటర్లు, సిబ్బంది మరియు సందర్శకులు) పాటించాలి.  

• సాధ్యమైనంత వరకు ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి

• ఫేస్ కవర్లు / మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలి. 

• సబ్బుతో (కనీసం 40-60 సెకన్ల పాటు) తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. మీ చేతులు మురికిగా కనిపించకపోయినా తరచూ శుభ్రం చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకోండి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ తో అయితే (కనీసం 20 సెకన్లు) చేతులను శుభ్రం చేసుకోవాలి.

• దగ్గు, తుమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతులను అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్, టిష్యూ పేపర్ ఉపయోగించాలి. టిష్యూ పేపర్ ను పారవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

• ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఏవైనా అనారోగ్యకర లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు లేదా జిల్లా, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. 

• సినిమా థియేటర్లు, మాల్స్ లోని డస్ట్ బిన్లలో, వాష్ రూమ్ లలో ఉమ్మివేయడం నిషేధించబడింది.

• ఆరోగ్యసేతు యాప్‌ డౌన్లోడ్ చేయడంతోపాటు ప్రతి ఒక్కరూ ఉపయోగించేలా సూచనలు ఇవ్వాలి. 
 
ఎక్కువ ప్రభావం ఉన్నవారిని రక్షించడం కోసం:
• 65 ఏళ్లు పైబడిన వారు, కొమోర్బిడిటీ (వివిధ రకాల అనారోగ్య లక్షణాలు) ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇంట్లో ఉండాలని సూచించారు. ఎంటర్టైన్మెంట్ పార్క్ లు నిర్వహించేవారు కూడా ఇందుకు అనుగుణంగా సంబంధిత వ్యక్తులకు సూచనలు చేయాలి. 

• ఎక్కువ అనారోగ్యంతో బాధపడే ఉద్యోగులు, గర్భిణీ స్త్రీలు మరియు ఇప్పటికే వివిధ చికిత్సలకు వైద్యం పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో ప్రత్యక్షంగా అవసరం అయితే తప్ప వారిని ఏ ఫ్రంట్-లైన్ పనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు.
 
 
ఎంటర్టైన్మెంట్ పార్కులు మరియు ఇతర ప్రదేశాలలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం మరియు నిర్వహించడం:
 
• కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ముందు, అన్ని పని ప్రాంతాలు, సందర్శకులు వినయోగించే ప్రాంతాలు మరియు బహిరంగ ప్రదేశాల్లో అందరూ కలిసి ఉపయోగించే సాధారణ స్థలాలు (సవారీలు, మ్యూజియంలు, ఉద్యానవనాలు, ఫుడ్ కోర్టులు, గిఫ్ట్ షాపుల, థియేటర్లు మొదలైన వాటితో సహా) 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి.  

• అక్కడ తరచూ తాకే వస్తువులు, ప్రాంతాలను తరచుగా (డోర్ నాబ్స్ / హ్యాండిల్స్, ఎలివేటర్ బటన్లు, హ్యాండ్ రైల్స్, స్లైడ్లు, కుర్చీలు, టాబ్లెట్ టాప్, బెంచీలు, వాష్ రూమ్ ఫిక్చర్స్ మొదలైనవి) గోడలు మరియు  అంతస్తులు మొదలైనవి శుభ్రపరచడం మరియు క్రమంగా క్రిమిసంహారక (1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఉపయోగించడం) ఎంటర్టైన్మెంట్ పార్క్ తెరవడానికి ముందు, మూసివేసే సమయంలో చివరిలో 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి.

• ప్రజలందరూ ఉపయోగించే హ్యాండ్ వాషింగ్ స్టేషన్ల దగ్గర తగినన్ని హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. మరుగుదొడ్లలో సబ్బు మరియు ఇతర సాధారణ ప్రాంతాలలో హ్యాండ్ శానిటైజర్లను తగినంత పరిమాణంలో అందించాల్సి ఉంటుంది.
• అన్ని హ్యాండ్ వాషింగ్ స్టేషన్లు, వాష్‌రూమ్‌లు, షవర్లు మరియు మరుగుదొడ్లను శుభ్రపరచాలి.

• సందర్శకులు మరియు ఉద్యోగులు ఉపయోగించిన ఫేస్ కవర్లు / మాస్కులు బహిరంగ ప్రదేశాలలో ఉంచిన ప్రత్యేక కవర్ డబ్బాలలో మాత్రమే పారవేసేలా సూచించాలి.

• స్విమ్మింగ్ పూల్ (వర్తించే చోట) మూసివేసి ఉంచాలి.

• నీటితో అవసరమైన వినోద ఉద్యానవనాలు మరియు వాటర్ రైడర్స్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రెగ్యులర్ గా మంచి నీటితో వడపోత మరియు క్లోరినేషన్‌ను చేస్తూ ఉండాలి.

• వాటర్ రైడింగ్స్ లో నిర్దేశించిన విధంగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. 

• థియేటర్లులో భౌతిక దూరం పాటించేలా 50% సీటింగ్ సామర్థ్యాన్ని మాత్రమే అనుమతించాలి.  
 
కార్యకలాపాల ప్రణాళిక, షెడ్యూల్ మరియు కార్యకలాపాల పర్యవేక్షణకు మార్గదర్శకాలు:
 
భౌతిక దూరం
• ప్రాంగణం లోపల మరియు వెలుపల భౌతిక దూరాన్ని నిర్ధారించేలా నేలపై నిర్దిష్ట గుర్తులు వేయాలి. అదే విధంగా, కార్యాలయ ప్రాంతాలు మరియు సాధారణ వినియోగ ప్రాంతాలలో కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. 

• ప్రాంగణం లోపల మరియు వెలుపల వచ్చే సందర్శకులను క్రమపద్దతి ప్రకారం వెళ్లేలా చూడాలి. వీటిని పర్యవేక్షించడానికి భౌతిక దూరం పాటించేందుకు వీలుగా తగినంత మంది సిబ్బందిని నియమించనున్నారు.
 
• సిబ్బంది మరియు సందర్శకుల కోసం అందుబాటులో ఉంచే లాకర్లను ఉపయోగించవచ్చు. అయితే భౌతిక దూరం మరియు క్రమంగా అక్కడ క్రిమిసంహారకం చేస్తూ ఉండాలి. 
 
రద్దీని నియంత్రించడం
• ఎంటర్టైన్మెంట్ పార్కుల్లో రద్దీ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెలవురోజులు, వారాంతాల్లో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనువైన ఏర్పాట్లు చేసుకోవాలి.

• అన్నింటికీ ఆన్‌లైన్‌ టికెట్లు ప్రోత్సహించాలి. నేరుగా వచ్చే వారికి టికెట్ల జారీకి ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలి.

• రద్దీ నియంత్రణకు వీలుగా వినోద పార్కులో అందుబాటులో ఉన్న స్థలాన్ని (ఫ్లోర్‌ ఏరియా)బట్టి టికెట్లు విక్రయించాలి.

• వినోద పార్కుల లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ పరిమితికి మించి జనం ఉండటానికి వీల్లేదు.

• రైడర్లు, ఫుడ్‌కోర్టుల్లో రద్దీని సీసీటీవీల ద్వారా పర్యవేక్షించాలి.

• లోపలికి ప్రవేశించిన తర్వాత అనుసరించాల్సిన మంచి చెడుల (డూస్‌ అండ్‌ డోంట్స్‌) గురించి టికెట్లు, పాస్‌ల వెనుకే ముద్రించాలి.

• అన్నిచోట్లా సహజమైన గాలి, వెలుతురు ప్రసరించేలా చర్యలు తీసుకోవాలి. ఏసీలు 24-30 డిగ్రీల మధ్యలోనే నిర్వహించాలి.

• వ్యర్థాల నిర్వహణ కోసం తగిన సంఖ్యలో చెత్త బుట్టలు అందుబాటులో ఉంచాలి.
 
కోవిడ్ పై అవగాహన
• కరోనా నియంత్రణ చర్యల గురించి అన్ని వినోద పార్కులూ తమ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లలో ప్రదర్శించాలి. వైరస్‌ లక్షణాలు ఉన్నవారు రావొద్దని స్పష్టంగా తెలియజేయాలి. 

• వైరస్‌ సంక్రమణాన్ని నిరోధించడానికి వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రికార్డెడ్‌ సందేశాన్ని నిరంతరం వినిపించాలి.

• ప్రముఖ స్థలాల్లో రాష్ట్ర హెల్ప్‌లైన్‌, స్థానిక అధికారుల ఫోన్‌ నంబర్లను ప్రదర్శించాలి.
 
ఆరోగ్యకరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు: 
• ప్రవేశ మార్గాల్లో అందర్నీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి. హ్యాండ్‌ శానిటైజర్‌ ఉంచాలి.

• కంటెయిన్‌మెంట్‌ జోన్లలోని సిబ్బందిని, సందర్శకులను అనుమతించకూడదు.

• సందర్శకులు ఎవరైనా అనారోగ్యంతో కనిపిస్తే వెంటనే వారిని ప్రత్యేక గదిలో ఉంచాలి. ఇలాంటి వారి గురించి సమీప ఆసుపత్రి, జిల్లా, రాష్ట్ర హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలి.
సాధారణ ప్రాంతాలలో కార్యకలాపాలు -స్టాల్స్, ఫలహారశాల, ఫుడ్ కోర్టులు, మారుతున్న గదులు, జల్లులు మొదలైనవి.

• క్యూపద్దతి పాటించేందుకు అవసరమైనంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసి నిర్వహణ ఉండేలా చూడాలి.

• ఫుడ్ కోర్టులు మరియు రెస్టారెంట్లలో సీటింగ్ సామర్థ్యం 50% కంటే ఎక్కువ అనుమతి వద్దు. 

• సీటింగ్ ఏర్పాటు చేయడంలోనే తగినంత భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. 

• ఫుడ్ కోర్ట్ సిబ్బంది / వెయిటర్లు మాస్క్ మరియు హ్యాండ్ గ్లోవ్స్ తప్పక ధరించాలి మరియు అవసరమైన ఇతర వాటిని తీసుకోవాలి. 
 
ముందు జాగ్రత్త చర్యలు:
• డబ్బును నగదు రూపంలో కాకుండా డిజిటల్ మోడ్ (ఆన్ లైన్ల్) చెల్లింపులను ప్రోత్సహించబడాలి.

• కస్టమర్లు వెళ్లిన ప్రతిసారీ టేబుల్స్ ను శుభ్రపరచాలి.  

• వంటగదిలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. 
 
సంబంధిత ప్రాంతంలో అనుమానితుడు లేదా ధృవీకరించబడిన పాజిటివ్ కేసులు వస్తే:
• అనారోగ్యంగా ఉండే వ్యక్తిని ఇతరుల నుండి వేరుచేయబడిన గదిలో లేదా ప్రదేశంలో ఉంచండి.

• అతను / ఆమెను వైద్యుడు వచ్చి పరీక్షించే వరకు మాస్కు లేదా కవర్ పెట్టుకోమని చెప్పాలి.

• వెంటనే దగ్గరల్లో ఉన్న ఆస్పత్రి లేదా క్లినిక్ గానీ, రాష్ట్ర లేదా జిల్లాస్థాయి హెల్ప్ లైన్ కి కాల్ చేయాలి.

• ఒకవేళ ఆ వ్యక్తి పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆ ప్రదేశాన్నంతా క్రిమిసంహారకం 

• పాజిటివ్ రిపోర్టు వచ్చిన వ్యక్తి తిరిగిన ప్రాంతాన్నంతా వెంటనే క్రిమిసంహాకరం చేయించాలి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం