Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిసెంబర్ 19, 20 తేదీల్లో అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం

డిసెంబర్ 19, 20 తేదీల్లో అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం
, మంగళవారం, 20 అక్టోబరు 2020 (20:03 IST)
మాలక్ష్మి గ్రూప్, కల్చరల్ సెంటర్ అఫ్ విజయవాడ, అమరావతి (సిసివిఏ) సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో జరిగే అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం -2020 నమోదు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.

కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, మాలక్ష్మి గ్రూపు సంస్ధల సీఈవో సందీప్ మండవ విజయవాడ సిసివిఏ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సిసివిఏ గత ఐదేళ్లుగా విజయవాడలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బహు భాషా కవి సమ్మేళనానికి దేశ విదేశాల నుంచి అనూహ్య స్పందన లభించటంతో పాటు  వరుసగా లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ ను కూడా  సొంతం చేసుకొందని కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

దేశ విదేశాలలోని బహు భాషా కవులు నవంబర్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకొని  కవితలను పంపవచ్చని తెలిపారు. మాలక్ష్మి గ్రూపు సంస్ధల సీఈవో సందీప్ మండవ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విడత ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

రచయితల నుండి వచ్చిన కవితల్లో 100 ఉత్తమ కవితల్ని ఎంపిక చేసి ఆయా కవులను అంతర్జాతీయ కవి సమ్మేళనంలో  తమ కవితలను వినిపించటానికి ఆహ్వానిస్తామని తెలిపారు.

ఆసక్తి ఉన్న కవులు “సిసివిఏ.ఇన్” లో లాగిన్ అయ్యి తమ పూర్తి వివరాలను నమోదు చేయటం ద్వారా అమరావతి అంతర్జాతీయ కవి సమ్మేళనం -2020లో పాల్గొనాల‌ని తెలిపారు. మాలక్ష్మి సంస్ధ సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుబ్బాకలో పవన్ కళ్యాణ్ ప్రచారం