Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బెయిల్ మంజూరు

కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బెయిల్ మంజూరు
, బుధవారం, 25 ఆగస్టు 2021 (09:41 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెంప పగలగొడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర దుమారం రేపిన కేసులో కేంద్రమంత్రి నారాయణ్ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనకు రాయ్‌గఢ్‌లోని మహద్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. 
 
కేంద్ర మంత్రి రాణే అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని, ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిలు మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. పరిశీలించిన న్యాయస్థానం రాణేకు బెయిలు మంజూరు చేసింది.
 
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం రాయ్‌గఢ్ జిల్లాల్లో పర్యటించిన నారాయణ్ రాణే మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నాళ్లయిందో కూడా మన ముఖ్యమంత్రికి తెలియదని, అలాంటి వ్యక్తిని పట్టుకుని చెంపలు పగలగొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు స్టేషన్‌లలో కేంద్ర మంత్రి రాణేపై కేసులు పెట్టారు. శివసేన నాయకులు ముంబైలో కూడా ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌తో పాటు, నాసిక్‌, పుణెల్లోనూ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో కేంద్ర చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న రాణేను రత్నగిరి జిల్లాలో జన ఆశీర్వాద్‌ యాత్రలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, అరెస్టు తర్వాత తనకు రక్తపోటు ఎక్కువైందని, మధుమేహ స్థాయి పెరిగిందని మంత్రి చెప్పడంతో వైద్య పరీక్షలు చేయించారు. 
 
తదుపరి విచారణ నిమిత్తం రాయ్‌గఢ్‌ పోలీసులకు అప్పగించారు. రాత్రి పొద్దుపోయాక మహాద్‌లోని మెజిస్ట్రేట్‌ కోర్టులో మంత్రిని హాజరుపరచగా బెయిలు మంజూరైంది. పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోసం బాంబే హైకోర్టులో రాణె తొలుత చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం