Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్నారులకు టీకా పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం - పొరపాటున మరో టీకా వేసి...

చిన్నారులకు టీకా పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం - పొరపాటున మరో టీకా వేసి...
, బుధవారం, 5 జనవరి 2022 (08:21 IST)
దేశ వ్యాప్తంగా చిన్నారులకు కరోనా టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 15 నుంచి 18 యేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకాలు పంపిణీ కార్యక్రమం ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభమై, దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో మాత్రం ఈ వ్యాక్సినేషన్‌లో అపశృతి చోటుచేసుకుంది. 
 
ఈ రాష్ట్రంలోని నలంద జిల్లాలో వ్యాక్సినేషన్ సిబ్బంది పొరపాటు కోవాగ్జిన్ టీకాకు బదులు కోవిషీల్డ్ టీకా వేశారు. టీకా కోసం వ్యాక్సినేషన్ సెంటరుకు వెళ్లిన కిషోర్ పియూష్, ఆర్యన్ కిరణ్‌లకు కోవాగ్జిన్ వేయాల్సిన సిబ్బంది పొరపాటున కోవిషీల్డ్ వేశారు.
 
ఈ విషయాన్ని ఆ చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్కెట్‌లో కోవిడ్ మాత్రలు - రూ.1,399 మాత్రమే...