Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సబర్మతీ తీరాన్ని సందర్శించనున్న ట్రంప్

Advertiesment
సబర్మతీ తీరాన్ని సందర్శించనున్న ట్రంప్
, శుక్రవారం, 31 జనవరి 2020 (08:24 IST)
ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గుజరాత్‌లోని సబర్మతి నదీ తీరాన్ని సందర్శించనున్నారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజరు రూపానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలోని శాస్త్రీనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో రూపాని మాట్లాడారు. ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన, శుభ్రమైన నది సబర్మతి. ప్రధానమంత్రి నరేంద్రవెూదీ వల్లే ఇది సాధ్యమైంది.

జపాన్‌, ఇజ్రాయెల్‌ దేశాల ప్రధానమంత్రులు ఈ నదిని సందర్శించి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరిలో భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా సబర్మతి నదీ తీరాన్ని సందర్శిస్తారు’ అని రూపానీ  తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమ‌లలో రథసప్తమికి స‌ర్వం సిద్ధం