Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా- త్రిస్సూర్ ఉత్సవాలు రద్దు.. 58 సంవత్సరాల తర్వాత..?

కరోనా- త్రిస్సూర్ ఉత్సవాలు రద్దు.. 58 సంవత్సరాల తర్వాత..?
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (15:42 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగిందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ప్రతీ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే త్రిస్సూర్‌ పూరమ్‌ ఉత్సవాలను రద్దు చేసింది. ఇలా ఈ ఉత్సవాలు జరగకుండా ఉండడం గత 58 ఏళ్లలో ఇదే మొదటిసారని పలువురు అంటున్నారు. 
 
ఇక ప్రతిఏటా రెండు నెలలపాటు జరిగే పూరమ్‌ ఎగ్జిబిషన్‌ ఏప్రిల్‌ 1న ప్రారంభం కావాల్సి వున్నప్పటికీ లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో ఆ ఎగ్జిబిషన్ కూడా రద్దు అయింది. ఇదిలా ఉండగా.. కేరళలో కూడా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 
 
కరోనా వైరస్ సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల కారణంగా ప్రతిష్టాత్మక ఉత్సవాలు, టోర్నీలు అయివా పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేరళ సర్కారు త్రిస్సూర్ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్షికంగానే లాక్‌డౌన్ అనుమతులు.. ఎప్పటి నుంచో?