Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్షికంగానే లాక్‌డౌన్ అనుమతులు.. ఎప్పటి నుంచో?

పాక్షికంగానే లాక్‌డౌన్ అనుమతులు.. ఎప్పటి నుంచో?
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (15:41 IST)
కరోనా వైరస్ కట్టడికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగా, లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు పొడగించింది. అయితే, 20వ తేదీ తర్వాత సమీక్ష జరిపి లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రటించారు. 
 
కానీ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఎటువంటి మినహాయింపులు ఉండవని స్పష్టంచేసింది. అయితే నిత్యావసరాలు ఇళ్ల వద్దకు వెళ్లే ఏర్పాటు చేస్తారు. హాట్‌స్పాట్‌ జోన్లు ఏవో రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు ప్రకటించాలి. ఆ ప్రాంతాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. అవేంటంటే. 
 
* వైద్య సేవలకు తప్ప మిగిలిన ఏ అవసరం కోసం సరిహద్దును దాటేందుకు ఎవరినీ అనుమతించరు.
* ఆరోగ్య, ఔషధ కేంద్రాలు, దుకాణాలు తెరిచి ఉంటాయి.
* వివాహాలు, శుభకార్యక్రమాలకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి. సందర్భం బట్టి సంఖ్యకు అనుమతి ఇస్తారు.
* కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు 20 మంది వరకు అనుమతిస్తారు. 
* ఉపాధి హామీ పనులకు కూలీలను అనుమతించనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ పనులు చేయాల్సి ఉంటుంది.
* వ్యవసాయ పనులకైనా ఇతర ప్రాంతాల నుంచి కూలీల తరలింపునకు అనుమతించరు.
* ఆక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు అనుమతిస్తారు.
* భవన నిర్మాణాలకు షరతులతో అనుమతిస్తారు.
* బ్యాంకుల కార్యకలాపాలు ఇప్పటిలాగే యథావిధిగా కొనసాగుతాయి.
* పాలు, పాల ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బరు సాగు పనులు, ఫౌల్ట్రీ కొనసాగించవచ్చు.
* అనాథాశ్రమాలు, దివ్యాంగుల కేంద్రాలకు అనుమతి.
* ఈకామర్స్ కార్యకలాపాలు, వాహనాలకు అనుమతి. 
* ఎలక్ట్రిషియన్, ఐటీ మరమ్మతులు, మోటారు మెకానిక్‌లు, కార్పెంటర్లకు అనుమతి.
* ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు యథాతథం.
* ఐటీ సంస్థలు యాభై శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి.
* రోడ్డు పక్కన దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలకు అనుమతి. 
* విద్య, శిక్షణ సంస్థలు మూసివేయాలి. మతపరమైన కార్యక్రమాలు నిషేధం.
* బార్లు, షాపింగ్ మాళ్లు, థియేటర్లు, జిమ్, స్పోర్ట్స్ క్లబ్, ఈత కొలనులపై నిషేధం యధాతథం.
* వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరవొచ్చు. వ్యవసాయ పరికరాలు అద్దెకు ఇవ్వొచ్చు.
* ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు, విత్తనోత్పత్తి కేంద్రాలు తెరవవచ్చు.
* గోదాములు, శీతల గోదాములకు అనుమతి.
* గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి పనులు, రోడ్ల నిర్మాణం చేపట్టవచ్చు. పారిశ్రామిక ప్రాజెక్టుల పనులు చేపట్టవచ్చు.
* మాస్కులు ధరించడం తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా వేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ సరే.. కొత్తగా బ్యాట్ కరోనా వైరస్...