Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

215వ నామినేషన్ దాఖలు చేసిన ఎన్నిక రారాజు!

Advertiesment
215వ నామినేషన్ దాఖలు చేసిన ఎన్నిక రారాజు!
, ఆదివారం, 14 మార్చి 2021 (12:22 IST)
వచ్చే నెల ఆరో తేదీన తమిళనాడు శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం ఈ నెల 12వ తేదీ నుంచి నామినేషన్ దాఖలు ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమతమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దీంతో అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికల రారాజుగా పేరొందిన పద్మరాజన్ పేరు మరోమారు తెరపైకి వచ్చింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఇలా నామినేషన్ దాఖలు చేయడం ఇది 215వసారి కావడం గమనార్హం. 
 
ఈయన వివరాలను పరిశీలిస్తే, పద్మరాజన్ ఓ సాధారణ వ్యక్తి మాత్రమే. అయినప్పటికీ ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారు. తాజాగా, శనివారం కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇలా నామినేషన్ దాఖలు చేయడం ఇది వరుసగా 215వ సారి కావడం గమనార్హం.
 
‘తేర్దల్ మన్నన్’ (ఎన్నికల రాజు)గా పేరు పొందిన ఆయన మెట్టూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఏప్రిల్ 6న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. 8వ తరగతి మాత్రమే చదువుకున్న పద్మరాజన్ సహకార సంఘాల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అన్నింటిలోనూ పోటీచేస్తారు. డిపాజిట్ చేసేందుకు డబ్బులు లేకుంటే భార్య శరీరంపై ఉన్న నగలను కుదవపెట్టి మరీ నామినేషన్ వేస్తుంటారు.
 
1998లో తొలిసారి మెట్టూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. ఆ తర్వాతి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రధాని సహా అగ్రనేతలు ఎక్కడ పోటీచేస్తే అక్కడ ఆయన కూడా పోటీ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పద్మరాజన్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.37 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం