Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన టీఎంసీ ఎంపీ.. ఆమెది డర్టీ మైండ్‌ అంటూ ఫైర్

Advertiesment
మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన టీఎంసీ ఎంపీ.. ఆమెది డర్టీ మైండ్‌ అంటూ ఫైర్
, బుధవారం, 10 మార్చి 2021 (12:59 IST)
Kalyan Banerjee
పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ హోరా హోరీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ప్రెస్‌మీట్‌లతో ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటూ వేడెక్కిస్తున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తన ట్విటర్ ఖాతాలో వీడియో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా ఓ ఎంపీ పక్కనే కూర్చున్న మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  
 
ఈ వీడియోలో టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం అని క్యాప్షన్ పెట్టారు. ఇటువంటి హాట్ హాట్ వాతావరణంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. తమ పార్టీకే చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం టీఎంసీకి కాస్త తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని సీఎం మమతా బెనర్జీ బీజేపీతో పోరాడుతుంటే ఈ ఘటన ఆమెకు తలనొప్పిలా తయారైంది.
 
ఈ వీడియోను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. దానికి ''టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం'' అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. ఎంపీ కల్యాణ్ బెనర్జీ బాన్‌కురా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడని పేర్కొన్నారు. 
 
బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ట్వీట్‌పై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ స్పందిస్తూ..'ఆమె తన డర్టీ మైండ్‌ను బయటపెట్టుకున్నారు. అన్నా చెల్లెలి రిలేషన్ ఏంటో ఆమె తెలుసుకోవాలని సుద్దులు చెప్పారు. నేను కూడా బాన్‌కురా నియోజకవర్గానికి చెందిన వాడినే. 25 ఏళ్లుగా ఆమెను సొంతచెల్లిగా చూసుకుంటున్నా. డర్టీ మైండ్ ఉన్న లాకెట్ ఛటర్జీ ఈ విషయాన్ని తెలుసుకోవాలి.” అని ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వు.. నీ కడుపులోని బిడ్డ చచ్చిపోండి... యువతికి ప్రియుడి వార్నింగ్