Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికల బాండ్ల రద్దు బీజేపీక ఎదురుదెబ్బ కాదు : ప్రధాని మోడీ

Advertiesment
narendra modi

ఠాగూర్

, సోమవారం, 1 ఏప్రియల్ 2024 (09:34 IST)
ఎన్నిక బాండ్ల రద్దు విషయం తమకు ఎదురు దెబ్బ వంటిది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బాండ్ల రద్దు చూసి సంతోషిస్తున్న వారు  భవిష్యత్తులో పశ్చాత్తాపం చెందుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల బాండ్ల వల్లనే దర్యాప్తు ఏజెన్సీలు నిధులు మూలాలన్ని సులభంగా గుర్తించగలిగాయని ఆయన వెల్లడించారు. 2014కు ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదని ఆయన ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇందులో ఆయన అనేక అంశాలపై స్పందించారు. ఎన్నికల బాండ్ల రద్దు అంశం బీజేపీకి ఎదురుదెబ్బగా తాము భావించట్లేదన్నారు. ఏ వ్యవస్థ కూడా పూర్తిగా స్థాయిలో పకడ్బందీగా ఉండదన్నారు. లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. 
 
'అసలేం జరిగిందని మేము దీన్ని ఎదురుదెబ్బగా భావించాలో చెప్పండి? ఎలక్టోరల్ బాండ్ల రద్దు చూసి సంబరపడుతూ చిందులేస్తున్న వారు భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు. అసలు ఈ రోజు నిధులు రాకడ గురించి ఇంత సులభంగా తెలిసిందంటే అది ఎన్నికల బాండ్ల వల్లే. 2014కు ముందు ఏ దర్యాప్తు ఏజెన్సీ అయినా ఈ వివరాలను సేకరించగలిగేదా? లోపాలే లేని వ్యవస్థ ఉండదు. అయితే, ఎప్పటికప్పుడు వ్యవస్థలను మెరుగుపరుచుకుంటూ వెళ్లాలి' అని మోడీ అన్నారు.
 
ఎన్నికల బాండ్లు ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందంటూ సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు మేరకు స్టేట్ బ్యాంక్ ఇండియా బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించింది. ఎన్నికల సంఘం ఈ సమాచారాన్ని బహిర్గతం చేసింది. దీని ఆధారంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసింది. క్రిమినల్ కేసులున్న అనేక సంస్థలు ఎన్నికల బాండ్లు కొన్నాయని ఆరోపించింది.
 
కాగా, తాను చేసే ప్రతిపనిలోనూ రాజకీయం చూడొద్దని ప్రధాని మోడీ అన్నారు. తాను దేశం కోసం పనిచేస్తానని, తనకున్న అతిపెద్ద బలం తమిళనాడేనని కూడా వ్యాఖ్యానించారు. ఓట్లే తన ప్రాధాన్యత ఉంటే ఈశాన్య రాష్ట్రాలకు ఇంత చేసి ఉండేవారం కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రులు ఆ ప్రాంతాన్ని దాదాపు 150 సార్లు సందర్శించారని, గత ప్రధానులకంటే ఎక్కువగా తాను మూడు సార్లు ఈశాన్య రాష్ట్రాల పర్యటన చేపట్టానని మోడీ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసుల వాహనాల్లోనే భారాసా ఎన్నికల నిధుల తరలింపు : త్వరలో నోటీసులు!!