Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ లేదు

ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ లేదు
, సోమవారం, 11 మే 2020 (08:23 IST)
కరోన వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న తరుణం లో ఎప్పుడు పూర్తిగా నయం అవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఉన్న ఈ సమయంలో తమ కుటుంబం వందల సంవత్సరాలుగా ఆస్తమా,దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరంవేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన అన్ని ప్రచార సంస్థలకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. యావత్ ప్రపంచ మానవాళిని గృహ నిర్బంధం చేయిస్తూ అందినవార్ని అంతమొందిస్తున్న మహ్హమ్మారీ కరోనా ప్రభావానికి ఏమందూ లేదు. ప్రతి ఒక్కరూ దూరం పాటించడంతో పాటు, ప్రతి క్షణం పరి శుభ్రత పాటించడమూ, అత్యవసర మైతే తప్ప ఇంటి నుండి బయట కు రాకుండా ఉండటమే రక్షణ అని బత్తిని హరనాథ్ గౌడ్ అన్నారు.
 ఏటా దేశ విదేశాలనుంచి వేలాది మంది మా చేప మందుకోసం హైదరాబాద్ వస్తుంటారని.ఈ సంవత్సరం మాత్రం  ఎవ్వరు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈ నెల 29 తో ముగిసినా తరువాత పరిస్థితులను బట్టి జూన్ లో పొడిగించినా తాము మాత్రం ఈ సారి చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని స్పష్టం చేశారు.

తమ పేరుతో ఎవరైనా చేప మందు ఇస్తామని ప్రకఠిస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని తక్షణం మాకు గానీ పోలీసు వారికి గాని తెలియచేయాలని బత్తిని హరనాథ్ గౌడ్ ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపారు.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల వారు ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రతి ఏటా మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఇతర స్వచ్ఛంద సంస్థలు, బద్రివిషాల్ పన్నాలాల్ పిట్టి ట్రస్ట్, అగ్రవాల్ సేవా సంగ్ సభ్యులు అందించే సహకారం ఎన్నడూ మరువలేనిది వారందరికీ ఈ ప్రకటన ద్వారా మరియు ప్రత్యేకంగా ఈ సమాచారాన్ని తెలియచేస్తున్నట్లు హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు.

కావున  ఈ సంవత్సరం బత్తిని చేప ప్రసాదం  పంపిణీ చేయడం లేదని ప్రజలందరూ గ్రహించి గలరని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతర్జాతీయ విమానాశ్రయం పరిశీలించిన విజయవాడ పోలీస్ కమిషనర్