Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత కోటి రూపాయలకు ఇడ్లీ తిన్నారా? ఏంటయ్యా ఇది..?

జయలలిత కోటి రూపాయలకు ఇడ్లీ తిన్నారా? ఏంటయ్యా ఇది..?
, సోమవారం, 31 డిశెంబరు 2018 (15:44 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు. ఇప్పటికే జయ మరణంపై ఆర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ కమిటీ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె మరణంలో తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్, అపోలో ఆసుపత్రి, అప్పటి చీఫ్ సెక్రటరీ రామమోహన్‌రావు కుట్ర పన్నారని కమిటీ ఆరోపించింది. 
 
రాధాకృష్ణన్ కమిషన్ ముందు భిన్న వాదనలు వినిపించారని, జయలలితను మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లడానికి కూడా అంగీకరించలేదని కమిషన్ అడ్వొకేట్ మహ్మద్ జఫారుల్లా ఖాన్ ఆరోపించారు. కమిషన్ ఆరోపణల నేపథ్యంలో జయలలిత మృతిపై పలు అనుమానాలున్నాయని.. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్, రామ్మోహన్ రావులను విచారించాలని న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం డిమాండ్ చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన అపోలో ఆస్పత్రిని పిక్నిక్ స్పాట్‌గా మార్చి.. కోటి రూపాయలకు ఇడ్లీలను తిన్నదెవరు అంటూ ప్రశ్నించారు. 
 
జయలలిత హృద్రోగ సమస్యకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించి వుంటే.. ఆమెను కాపాడివుండొచ్చు. కానీ జయకు యాంజియోగ్రామ్ చేయకూడదని ఎవరు చెప్పారని అడిగారు. అలాగే విదేశాలకు పంపి అమ్మకు చికిత్స అందించే సౌకర్యం వున్నప్పటికీ ఆమెను అక్కడకు తరలించని కారణం ఏమిటని అడిగారు. అందుచేత ఓ స్పెషల్ కమిషన్‌తో అమ్మ మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో ఈ కమిషన్ వుండాలని షణ్ముగం డిమాండ్ చేశారు. జయలలిత మృతికి ఆమె నెచ్చెలి శశికళకు కూడా సంబంధం వున్నట్లు షణ్ముగం ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌తో పట్టేశారు.. కిడ్నాప్ బాబు దొరికాడు..