Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాహనదారులకు కేంద్రం తీపి కబురు, ఏంటది

Advertiesment
వాహనదారులకు కేంద్రం తీపి కబురు, ఏంటది
, శనివారం, 28 ఆగస్టు 2021 (18:05 IST)
రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆగష్టు 28న వాహనదారులకు తీపి కబురు తెలిపింది. తాజా వాహనాలకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాల బదిలీని సులభతరం చేయడానికి 'భారత్ సిరీస్ (BH- సిరీస్)' కింద కొత్త వాహనాల కోసం కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం కొత్త భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ స్కీమ్‌ని రూపొందించింది. దీని ప్రకారం ఒక వ్యక్తి మరొక రాష్ట్రానికి వెళితే వాహనం కోసం కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ పొందాల్సిన అవసరం లేదు.
 
మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంటూ... వాహన రిజిస్ట్రేషన్ కోసం భారత్ సిరీస్ అనేది ఐటి ఆధారిత పరిష్కారం, ఇది చలనశీలతను సులభతరం చేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం. BH- సిరీస్ అనేది మరొక రాష్ట్రానికి వెళ్లేటప్పుడు వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడం అని తెలిపింది.
 
ప్రస్తుతం, మరొక రాష్ట్రానికి వెళ్లేటప్పుడు వాహనాల రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. దీని కోసం గతంలో నమోదు చేసుకున్న పాత రాష్ట్రం నుండి నో-అబ్జెషన్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది, తర్వాత కొత్త రాష్ట్రంలో వాహనాన్ని నమోదు చేసుకొని రోడ్డు పన్ను చెల్లించాలి. అప్పుడు, పాత రాష్ట్రంలో ఇప్పటికే చెల్లించిన రహదారి పన్ను కోసం వాపసు కోసం ఫైల్ చేసుకోవాల్సి వుంటుంది.
 
భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సౌకర్యం రక్షణ సిబ్బంది, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే వ్యక్తులు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ రంగ కంపెనీలకు అందుబాటులో ఉంటుంది.
 
భారత్ సిరీస్ వాహనాల ప్రయోజనాలు ఏమిటి?
 
మోటార్ వాహనాల చట్టం, 1988 లోని సెక్షన్ 47 ప్రకారం, వాహనం రిజిస్టర్ చేయబడిన రాష్ట్రం కాకుండా ఇతర ఏ రాష్ట్రంలో అయినా ఒక వ్యక్తి కేవలం 12 నెలలు మాత్రమే తన వాహనాన్ని ఉంచడానికి అనుమతించబడతాడు. ఆ 12 నెలల్లో, వ్యక్తి కొత్త రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. ఐతే కొత్త భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్ గుర్తుతో, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వాహనాన్ని తరలించేటప్పుడు ఒక వ్యక్తి తిరిగి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవలసిన అవసరం ఉండదు. ఈ పథకం కింద, మోటారు వాహన పన్ను 2 సంవత్సరాల పాటు లేదా రెండు రెట్లు అధికంగా విధించబడుతుంది. 14వ సంవత్సరం పూర్తయిన తర్వాత, మోటారు వాహన పన్ను ఏటా వసూలు చేయబడుతుంది, ఇది ఆ వాహనం కోసం గతంలో వసూలు చేసిన మొత్తం కంటే సగం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌రోనా ఫ్రీ న‌గ‌రంగా విజ‌య‌వాడ‌!