Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెల్లిని తల్లిని చేసిన 'కామాంధ' అన్న

Advertiesment
చెల్లిని తల్లిని చేసిన 'కామాంధ' అన్న
, శుక్రవారం, 24 జనవరి 2020 (22:02 IST)
వావివరసలు మర్చిపోయిన ఒక అన్న తన సొంత చెల్లెలిని బెదిరించి అత్యాచారం చేశాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు సంవత్సరాల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూనే వచ్చాడు. చివరకు ఆమె గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరంలోని పనాస్ గ్రామంలోని ఎస్‌ఎంసి క్వార్టర్స్‌లో నివసిస్తున్న రమేష్ గాడ్సే  రెండు రోజుల క్రితం టిఫిన్ చేయడం కోసమని హోటల్‌కి బయలుదేరాడు. అయితే మార్గమధ్యంలో అతనికి ఎవరో చిన్న పిల్ల ఏడుపు వినిపించింది. దీంతో అతడు ఏడుపు వినిపించిన వైపు చూడగా అక్కడ, చెత్త కుప్పలో పడేసిన ఓ పసిబిడ్డ కనిపించింది. ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన అతను ఆ బిడ్ద దీనస్థితిని చూసి చలించి, తన స్వెటర్‌ని బిడ్డ చుట్టూ చుట్టి తనతో పాటు ఇంటికి తీసుకు వెళ్ళాడు. అక్కడ అతని తల్లికి రమేష్ మొత్తం పరిస్థితిని వివరించి చెప్పాడు.
 
దీంతో ఆ తల్లి తక్షణమే స్పందించి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసులు ఆ బిడ్డను శిశు వైద్య ఆసుపత్రికి తరలించి, తర్వాత రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇలా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పనాస్ గ్రామంలో గర్భవతులు ఎవరెవరు ఉన్నారో విచారణ చేశారు, ఆ విచారణలో ఒక అమ్మాయి గర్భంతో ఉందని తెలిసింది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి ఆమెను విచారించగా, తానే ఆ బిడ్డను చెత్త కుప్పలో పడేసానని అంగీకరించింది. ఎందుకని ప్రశ్నించిన పోలీసులకి ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిందట.
 
తనని తన సొంత అన్నయ్య బలవంతం చేయడంతో అతడితో గత రెండేళ్లగా శృంగారం చేస్తున్నానని, దాని ఫలితంగా గర్భం వచ్చిందని చెప్పింది. కానీ పుట్టిన బిడ్డ ఎవరికి కనిపించినా తన పరువు పోతుందనే ఉద్దేశంతో పసికందును చెత్తకుప్పలో పడేశానని చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం పోలీసులు ఆమె అన్నయ్యపై సెక్షన్ 375, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో సీఎం జగన్ ప్లాన్... 15 మంది తెదేపా ఎమ్మెల్సీలు జంప్ చేస్తారా?