Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలు అందంగా ఉంటే ఎక్కువ వేతనం ఇస్తారు.. డీఎంకే ఎమ్మెల్యే

Advertiesment
gandhi rajan
, ఆదివారం, 3 జులై 2022 (15:02 IST)
మహిళలు అందంగా ఉంటేనే ఎక్కువ జీతం ఇస్తారని తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఉన్నత విద్యను ఎంచుకుని ఉద్యోగాలకు వెళ్లేలా మార్గనిర్దేశం చేసేందుకు కాలేజ్ డ్రీమ్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 
 
దీని ఆధారంగా పాఠశాల విద్యాశాఖ ద్వారా ఉన్నత విద్య మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే శనివారం దిండిగల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొని పన్నెండో తరగతి పూర్తి చేసిన విద్యార్థులతో వేడచందూర్ డీఎంకే గాంధీ రాజన్ మాట్లాడారు. 
 
'బహుళజాతి కంపెనీలు మీకు ఇంగ్లీషులో స్పష్టంగా, త్వరగా మాట్లాడగల జ్ఞానం ఉందా లేదా అని చూస్తాయి. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి, మీరు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగితే మాత్రమే మీకు ఉద్యోగం, అధిక జీతం లభిస్తుంది. మహిళలు అందంగా, మరింత అందంగా ఉండాలని బహుళజాతి కంపెనీలు ఆశిస్తాయి. వారికి అదనపు జీతం వస్తుంది' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. 
 
ఇంగ్లీషు తెలిస్తే ఉద్యోగం వస్తుందని, అందంగా ఉన్నందున ఎక్కువ జీతం వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్మే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విద్యార్థులను షాక్‌కి గురిచేశాయి. ముఖ్యంగా అందంగా ఉంటేనే అదనపు జీతం వస్తుందన్న ప్రకటన విద్యార్థినుల్లో కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో మళ్లీ భూకంపం - భూకంప లేఖినిపై 5.2గా నమోదు