పోయెస్ గార్డెన్ అనే పేరు చెబితే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుర్తుకువస్తారు. దక్షిణాదిలో శక్తివంతమైన అధినేత్రి జయలలిత అకాల మరణం తర్వాత ఆమె ఆస్తుపాస్తులపై కోర్టులో కేసులు నడిచాయి. ముఖ్యంగా జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ ఇంటి గురించి చాలా వాదన జరిగింది.
గత తమిళనాడు ప్రభుత్వం పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయాన్ని మ్యూజియంగా మార్చాలని ప్రయత్నం చేసింది. ఐతే జయలలిత మేనకోడలు హైకోర్టులో తన మేనత్త వేదనిలయం తమకే చెందాలని పిటీషన్ వేసింది.
గత నవంబర్ 24న వేద నిలయాన్ని జయలలిత వారసులైన దీపకు, ఆమె సోదరుడికి అప్పగించాలని తీర్పు వెలువరించింది. దీనితో ఆ ఇంటి తాళాలను జిల్లా కలెక్టర్ అధికారికంగా దీపకు అందించారు. తన మేనత్త వేద నిలయం ఇంటి తాళాలు తమకు ఇవ్వడంతో దీప ఎంతో సంతోషంగా కనిపించారు. తన మేనత్త ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందని అన్నారు.