Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్రానికి షాకిచ్చిన పళనిస్వామి.. 3కాదు.. ద్విభాషా విధానానికే గ్రీన్ సిగ్నల్

Advertiesment
Tamil Nadu
, సోమవారం, 3 ఆగస్టు 2020 (13:11 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్రానికి షాక్ ఇచ్చారు. కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన ఈ కొత్త విద్యా విధానంలో ప్రతిపాతించిన త్రిభాషా విధానం తమకు ఆమోదయోగ్యం కాదని పళని స్వామి స్పష్టం చేశారు. పళనిస్వామి అధ్యక్షతన జరిగిన ఆ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో...కేంద్రం తీసుకొస్తున్న కొత్త జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకించాలని తీర్మానించారు. 
 
ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలులో ఉన్న ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తామని ఓ ప్రకటనలో పళనిస్వామి స్పష్టం చేశారు. త్రిభాషా విధానం తమిళ ప్రజల మనోభిప్రాయాలకు వ్యతిరేకమని... ఈ మేరకు కొత్త విద్యా విధానంలో మార్పులు చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. 
 
ఎలాంటి విద్యా విధానాన్ని అమలు చేయాలన్నది రాష్ట్రాల నిర్ణయానికే విడిచిపెట్టాలని కేంద్రాన్ని కోరారు. హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గతంలో తమిళనాడులో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని సీఎం పళనిస్వామి గుర్తుచేశారు.
 
కొత్త విద్యా విధానాన్ని ఇప్పటికే తమిళనాడులోని ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యా సంస్కరణల పేరుతో హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా తమపై రుద్దే కుట్ర జరుగుతోందని, దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సస్పెన్స్‌కు తెరదించిన మైక్రోసాఫ్ట్... టిక్‌టాక్‌పై ఆ లోపు తుది నిర్ణయం