Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీచర్ మందలించడంతో మొదటి అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థిని

Advertiesment
woman victim
, ఆదివారం, 27 నవంబరు 2022 (17:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో దారుణం జరిగింది. స్కూల్ టీచర్ తిట్టిందన్న కోపంతో ఓ విద్యార్థిని స్కూలు భవనంలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో ఆ విద్యార్థిని తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లా కేంద్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా తనను వీడియో తీయాలని ఓ బాలిక కోరింది. దీంతో ఆ బాలిక వీడియో తీసింది. 
 
దీన్ని గమనించిన ఓ టీచర్ ఆ బాలికను మందలించారు. బాలిక తీయమనడంతోనే తాను వీడియో తీశానని బాధిత విద్యార్థి చెప్పినా టీచర్ వినిపించుకోలేదు. పైగా, అబద్ధాలు చెబుతున్నావంటూ మందలిచింది.
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ విద్యార్థిని మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేయడంతో ఆ బాలిక గాయపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏమీ లేని ఆకే కదా ఎగిరెగిరి పడేది : మంత్రి అంబటి రాంబాబు