Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

18వ అంతస్థు నుంచి దూకేసిన Bed Bath & Beyond CFO

Advertiesment
Bed Bath & Beyond CFO
, సోమవారం, 5 సెప్టెంబరు 2022 (15:51 IST)
Bed Bath & Beyond CFO
అమెరికాలోని కార్పొరేట్ సంస్థ బెడ్‌బాత్ అండ్ బియాండ్ ఇంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గుస్టావో అర్నాల్ (52) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. న్యూయార్క్‌లోని జెంగా టవర్ వద్ద 18 అంతస్తుల భవనంపై నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
బెడ్‌బాత్ అండ్ బియాండ్ ఇంక్ సంస్థ కొన్ని రోజుల క్రితం పలు స్టోర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని రోజులకే సీఎఫ్‌వో దుర్మరణం పాలయ్యాడని పోలీసులు తెలిపారు. 
 
బెడ్ బాత్ అండ్ బియాండ్ సంస్థలో గుస్టావో అర్నాల్ 2020లో చేరారు. అంతకుముందు ఆయన లండన్‌లోని ఒక కాస్మొటిక్స్ కంపెనీ బ్రాండ్ అవోన్ సీఎఫ్‌వోగా పని చేశారు. 
 
అంతకుముందు గత నెల 16న కంపెనీలో 55,013 షేర్లను విక్రయించేశాడు. గతవారం తమకు గల 900 స్టోర్లలో 150 స్టోర్లను మూసేస్తున్నట్లు బెడ్‌బాత్ అండ్ బియాండ్ ప్రకటించింది. నష్టాలను తగ్గించుకునేందుకు 20 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్‌బాస్‌ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా?