Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీలంక యువతి ధైర్యం : టూరిస్ట్ వీసాపై వచ్చి ప్రియుడితో సహజీవనం

శ్రీలంక యువతి ధైర్యం : టూరిస్ట్ వీసాపై వచ్చి ప్రియుడితో సహజీవనం
, గురువారం, 12 మార్చి 2020 (13:24 IST)
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడు కోసం ఓ యువతి దేశ సరిహద్దులను దాటి వచ్చింది. తన ప్రియుడు ఉన్న చోటికి వచ్చిన ఆ యువతి ఏకంగా అతనితో కలిసి సహజీవనం చేయసాగింది. ఈ విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రులు గమనించి పోలీసులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న యువతిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీలంకలోని రత్నపుర జిల్లా సమకిపురా రాజ్‌వార్ ప్రాంతానికి చెందిన రిషేవి అనే యువతి జైనుల్లాబ్దీన్ అనే వ్యాపారి కుమార్తె. ఆమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న ముబాకర్ (25) అనే యువకుడు పరిచయమయ్యాడు. 
 
ఆ పరిచయం ప్రేమగా మారగా, గత నెల 26న పర్యాటక వీసాపై రిషేవి చెన్నైకి వచ్చింది. ఆ తర్వాత ప్రియుడిని కలుసుకుని, అతనితోనే ఉండసాగింది. ఈ విషయం తెలుసుకున్న జైనుల్లాబ్దీన్, దుబాయ్ నుంచి వచ్చి, తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని కడలూరు పోలీసులను ఆశ్రయించాడు. 
 
కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, ఆమె చెన్నైలో ఉంటోందని గుర్తించి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ యువతి తాను మేజర్‌నని చెబుతోంది. దీంతో ప్రియుడితో వివాహం జరిపించాలా? లేక తండ్రితో పంపించాలా? అన్న విషయమై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు రూ.2 కోట్లతో హెఫా ఫిల్టర్లు