Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెల రోజుల్లో రూ.3 కోట్లు అర్జించిన టోమోటా రైతు

tomatos
, బుధవారం, 19 జులై 2023 (18:51 IST)
దేశ వ్యాప్తంగా టమోటా ధర ఆకాశాన్ని తాకింది. ఈ ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, టమోటా రైతుల పంట పండిస్తుంది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన రైతు ఈశ్వర్ గయ్కార్ నెల రోజుల్లోనే రూ.3 కోట్లు ఆర్జించి, కోటీశ్వరుడయ్యాడు. 
 
పూణె జిల్లాలోని జున్నార్ తహసీల్లోని పచ్ఘర్ గ్రామానికి చెందిన 36 ఏళ్ల ఈ రైతుకు ఈ ఏడాది మే నెలలో ధర తక్కువగా ఉండటంతో మార్కెట్‌కు తీసుకువెళ్లి అమ్మడమే కష్టంగా మారింది. పెద్ద మొత్తంలో టమోటా పంటను వేశాడు. కానీ ధర తక్కువగా ఉంది. అంత మొత్తాన్ని తీసుకువెళ్లడం అతనికి ఇబ్బందిగా మారింది.
 
అయినప్పటికీ తన 12 ఎకరాల పొలంలో టమోటా సాగును అలాగే కొనసాగించాడు. ఆ తర్వాత జూన్ నెల నుండి టమోటా ధరలు క్రమంగా పెరుగుతుండటంతో అతని పంట పండింది. దీంతో జూన్ 11 నుండి జులై 18 మధ్య టమోటా పంట దిగుబడి ద్వారా అతను ఏకంగా రూ.3 కోట్లు ఆర్జించాడు. ఫలితంగా ఆయన నెల రోజుల్లో మిలియనీర్‌గా మారిపోయాడు. 
 
దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, జున్నార్ తహసీల్‌లోని నారాయణగావ్‌లోని వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ (ఏపీఎంసి)లో ఈ నెల రోజుల కాలంలో 18,000 ట్రేల టమోటాలను విక్రయించాడు. ఒక్కో ట్రేలో 20 కిలోల వరకు టమోటాలు ఉంటాయి. దాదాపు మరో 4 వేల ట్రేలు ఉన్నాయని, వీటిని విక్రయించడం ద్వారా మరో రూ.50 లక్షలు వస్తాయని చెబుతున్నాడు.
 
తనకు రవాణా ఖర్చుతో మొత్తం కలిపి సాగు కోసం 40 లక్షల రూపాయలు ఖర్చయిందని చెప్పాదు. తనకు 18 ఎకరాల పొలం ఉందని, అందులో 12 ఎకరాల్లో టమాటా సాగు చేశానని, జూన్ 11 నుండి 18 వేల ట్రేలను విక్రయించి ఇప్పటి వరకు రూ.3 కోట్లు ఆర్జించానని తెలిపాడు. జూన్ 11న ఒక్కో ట్రే ధర రూ.770 (కిలో రూ.37 నుండి రూ.38) ఉండగా జులై 18వ తేదీ నాటికి రూ.2,200 (కేజీ రూ.110)కు పెరిగిందని వివరించాడు. టమోటాపై మంచి ఆదాయం వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. తక్కువ ధరల కారణంగా రెండు నెలల క్రితమే టమోటాను పారబోయాల్సి వచ్చిందని, ఆ తర్వాత ధరలు పెరగడంతో కలిసి వచ్చిందన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా ప్రభుత్వ పనితీరు బాగోలేదు : మంత్రి పేర్ని నాని అసహనం