Vikram Birthday, Thangalan
వైవిధ్యమైన యాక్టర్ చియాన్ విక్రమ్ కొత్త సినిమా తంగలాన్. పా. రంజిత్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా ఓ మేకింగ్ వీడియో గ్లింప్స్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ మూవీ గ్లింప్స్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారందరికీ నచ్చేలా మేకింగ్ తో పాటు ఓ అద్బుతమైన వీడియో రిలీజ్ చేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్) నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ మూవీ కోసం విక్రమ్ ఇంతకు ముందెప్పుడూ కనిపించని గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ వీడియో గ్లింప్స్ చూస్తోంటే మూవీ కోసం మొత్తం ఎంతో కష్టపడుతున్నట్టుగా ఉంది. ఈ తరహా చిత్రాల్లో విక్రమ్ ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తాడు. అది మరోసారి తంగలాన్ తో కనిపించబోతోందనిపిస్తోంది.
ప్యాన్ ఇండియన్ సినిమాగా బహుభాషల్లో విడుదల కాబోతోన్న తంగలాన్ లో విక్రమ్ తో పాటు ఫీమేల్ లీడ్స్ లో పార్వతి, మాళవిక మోహనన్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ ను తీసుకున్నారు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్, ముత్తుకుమార్ తో పాటు అనేకమంది ఇతర ప్రముఖులు నటిస్తున్నారు.