Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

Sanjay Shirsat

ఠాగూర్

, శనివారం, 30 నవంబరు 2024 (11:06 IST)
మహాయుతి కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు కమలనాథులు మొండి చేయి చూపించేందుకు పథక రచన చేస్తున్నారని ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివనసేన సంచలన ఆరోపణలు చేసింది. ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అలాగే, ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ప్రధానంగా కొత్త ముఖ్యమంత్రి, శాఖల కేటాయింపులపై పార్టీల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. 
 
మరోవైపు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే.. కూటమి ముఖ్యనేతల భేటీని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల వేళ శివసేన నేత సంజయ్‌ శిర్సాట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంలో షిండేను పక్కనబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 'షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం వల్ల ఈ ఎన్నికల్లో భాజపాకు ప్రయోజనం చేకూరింది. 
 
కొన్ని పథకాలకు ఎన్‌సీపీ అభ్యంతరం చెప్పినప్పటికీ షిండే వాటిపై ముందుకెళ్లారు. అవన్నీ ఎన్నికల్లో కూటమికి ఓట్లు కురిపించినవే. సాధారణంగా హోంశాఖను డిప్యూటీ సీఎంకే ఇస్తారు. ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే.. హోంశాఖను శివసేనకు ఇవ్వాలి. అలా కాదని సీఎం వద్దే ఉంచుకోవడం సరికాదు. కొత్త ప్రభుత్వంలో షిండేకు కీలక శాఖలు ఇవ్వకుండా పక్కనబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది' అని సంజయ్‌ శిర్సాట్‌ ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!