Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఎంపికపై వీడని ఉత్కంఠ - హస్తినకు ఆ ముగ్గురు నేతలు

devendra - shinday - ajith

ఠాగూర్

, బుధవారం, 27 నవంబరు 2024 (18:36 IST)
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. మహాయుతి కూటమి తరపున బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముందు వరుసలో ఉన్నప్పటికీ ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు. దీంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌లతో పాటు దేవేంద్ర ఫడ్నవిస్‌లు ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీంతో ఈ ముగ్గురు నేతలు గురువారం హస్తినకు వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు. ఆ తర్వాత సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, మహాయుతిలో ఏకాభిప్రాయం కుదరలేదని వస్తోన్న వార్తలపై ఫడ్నవిస్ స్పందించారు. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో ఇంకా నిర్ణయం జరగలేదని, అయినప్పటికీ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. 
 
ఇదిలావుంటే, కొత్తగా ఏర్పాటయ్యే మహాయుతి ప్రభుత్వంలో తన కుమారుడు శ్రీకాంత్‌ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఏక్‌నాథ్‌ షిండే పట్టుపడుతున్నట్లు సమాచారం. శ్రీకాంత్‌ ప్రస్తుతం కల్యాణ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతోపాటు తనకు మహాయుతి కూటమి కన్వీనర్‌ పదవి ఇవ్వాలని ఏక్‌నాథ్‌ షిండే డిమాండ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
 
అదేసమయంలో మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే అంశంపై రెండు మూడు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తుది నిర్ణయం తీసుకుంటారని ఎన్సీపీ నేత, రాయగఢ్‌ ఎంపీ సునీల్‌ తట్కరే అన్నారు. నవంబరు 23వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటికీ ఇంకా సీఎం ఎవరనే విషయంలో కొననసాగుతోన్న సస్పెన్స్‌పై ఆయన మాట్లాడారు. 
 
'కొత్త సీఎంను నిర్ణయించడానికి రెండు, మూడు రోజులు పట్టొచ్చు. ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలువుతుంది. భాజపా, శివసేన, ఎన్సీపీలు మహాయుతి సంకీర్ణ కూటమి సీఎం పదవికి ఎలాంటి ఫార్ములా నిర్ణయించుకోలేదు. ఓటమిని అంగీకరించేందుకు ఎంతో ధైర్యం, విశాల హృదయం అవసరం. ప్రజలు తిరస్కరించడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఈవీఎంలను నిందిస్తున్నారు' అని విపక్షాలపై మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం