Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏక్‌నాథ్ షిండే ప్రకటన అనేక మంది సందేశాలను నివృత్తి చేసింది : ఫడ్నవిస్

devendra fadnavis

ఠాగూర్

, గురువారం, 28 నవంబరు 2024 (14:53 IST)
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే ప్రకటన అనేక మంది సందేహాలను నివృత్తి చేసిందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫఢ్నవిస్ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే, కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. 
 
దీనిపై దేవంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఏకానాథ్ షిండే ప్రకటన చాలామంది సందేహాలను నివృత్తి చేసిందన్నారు. సీఎం ఎంపిక విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమని, వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ పై విధంగా స్పందించారు. మహాయుతి కూటమిలో ఎప్పుడూ ఒకరిపై మరొకరికి భిన్నాభిప్రాయాలు లేవని, ఏ విషయంలో అయినా తాము కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
 
తాము కలిసే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ అది వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. కొంతమందిలో కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఈరోజు షిండే వ్యాఖ్యలతో వారికి అర్థమై ఉంటుందన్నారు. త్వరలో తాము పార్టీ అగ్రనేతలను కలిసి నిర్ణయం (సీఎం పదవిపై) తీసుకుంటామన్నారు. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే, నూతన ప్రభుత్వం కొలువుదీరేంత వరకు గవర్నర్ కోరికపై షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంత జరిగినా ఏం జరగనట్లు క్యాజువల్‌గా వస్తున్నాడు.. (video)