Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్భయ దోషులకు ఆహారం తగ్గింపు

నిర్భయ దోషులకు ఆహారం తగ్గింపు
, బుధవారం, 15 జనవరి 2020 (09:47 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో  దోషులకు ఉరి తీయనున్న నేపథ్యంలో నలుగురు దోషులకు పెట్టే భోజనాన్ని తగ్గించారు. దోషులు జైల్లో చేసిన కూలీ పనికి పొందిన వేతనాలను వారివారి కుటుంబసభ్యులకు అందజేయాలని తిహార్ జైలు అధికారులు నిర్ణయించారు. నిర్భయ కేసులో నలుగురు దోషులు వారి కుటుంబసభ్యులను చివరిసారిగా కలిసేందుకు తిహార్ జైలు అధికారులు అవకాశం కల్పించారు.

తమకు మరణ శిక్షను నిలిపి వేయాలంటూ నిర్భయ దోషులు పెట్టుకున్న దరఖాస్తును జస్టిస్‌ ఎన్వీ రమణ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. దీంతో నిర్భయ దోషులు వినయ్‌, ముఖేశ్‌, పవన్‌, అక్షయ్‌లకు చివరిసారిగా వారి వారి కుటుంబసభ్యులను కలిసేందుకు తేదీ చెప్పాలని తిహార్ జైలు అధికారులు కోరారు.

ఈ నెల 22వతేదీన ఉదయం 7 గంటలకు తిహార్‌ జైల్లో నిర్భయ దోషులకు ఉరి తీయనున్న నేపథ్యంలో ఈ నెల 20వతేదీలోపు కుటుంబసభ్యులను కలవవచ్చిన జైలు అధికారులు సూచించారు. 20వతేదీ తర్వాత దోషులు వారి కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతించరు.

తిహార్ జైలు సూపరింటెండెంట్ సమక్షంలో నిర్భయ దోషులు వారి కుటుంబసభ్యులను కలిసి మాట్లాడనున్నారు. గతంలో పలుసార్లు దోషి శర్మను అతని తండ్రి కలిసేందుకు యత్నించినా అతను అనుమతించలేదు. గతంలో కుమార్, శర్మ, గుప్తాల తల్లిదండ్రులు వారం వారం జైల్లో కలిసేవారు.

మరో దోషి సింగ్ ను అతని కుటుంబసభ్యులు నవంబరు నెలలో చివరిసారిగా కలిశారు. సాధారణంగా జైలు మాన్యువల్ ప్రకారం జైల్లో దోషులను అరగంట కలిసి మాట్లాడేందుకు ఇద్దరు కుటుంబసభ్యులను అనుమతిస్తారు. నిర్భయ దోషులు వారి కుటుంబసభ్యులను చివరిసారిగా కలిసే తేదీని ఖరారు చేస్తే వారు ఇద్దరు కుటుంబసభ్యులను అరగంటకు పైగా అనుమతించనున్నట్లు జైలు అధికారులు చెప్పారు.
 
నలుగురు దోషులు జైల్లో పనిచేసి సంపాదించిన డబ్బును వారి కుటుంబసభ్యులకు అందజేయాలని తిహార్ జైలు అధికారులు నిర్ణయించారు.నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌లు తిహార్ జైల్లో ఉన్నపుడు చేసిన పనికి పొందిన వేతనాల డబ్బును జైలు అధికారులు లెక్క వేశారు.

ముకేశ్ సింగ్ జైల్లో అందరికంటే అత్యధికంగా రూ.69వేలు సంపాదించారు. మరో దోషి వినయ్ శర్మ రూ.39వేలు, పవన్ గుప్తా రూ.29వేలు సంపాదించారు. మరో దోషి అక్షయ్‌ కుమార్ జైలులో కూలీగా పనిచేసేందుకు నిరాకరించాడు. దీంతో అతనికి జైల్లో ఎలాంటి వేతనం దక్కలేదు. 
 
తిహార్ జైలులో నిర్భయ దోషి వినయ్ శర్మ పలుసార్లు అనుచితంగా వ్యవహరించాడు.ఇతను జైలు అధికారులకు సహకరించకుండా, భోజనం చేయకుండా ఆరుసార్లు గొడవ చేశాడు. వినయ్ శర్మ ప్రవర్తన జైల్లో సరిగా లేదని, మిగిలిన ముగ్గురు దోషులు జైల్లో బాగానే ఉన్నారని తిహార్ జైలు అధికారి ఒకరు వెల్లడించారు.

జైల్లో దుష్ప్రవర్తన కారణంగా వినయ్ శర్మకు జైలు అధికారులు 11 సార్లు శిక్షించారు.పవన్‌గుప్తాకు 8 సార్లు, అక్షయ్‌ కుమార్ కు 3 సార్లు, ముకేశ్‌ సింగ్‌ కు ఒకసారి జైలు అధికారులు  చిన్న చిన్న శిక్షలు వేశారు.
 
నిర్భయ కేసులో నలుగురు దోషులను ప్రత్యేక జైలు గదుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. కట్టుదిట్టమైన జైలు వార్డర్ల భద్రత మధ్య దోషులను ఉంచారు. నలుగురు దోషులకూ జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్‌ జైలులో చనిపోయే వరకూ వారిని ఉరి తీయాలని పటియాలా హౌస్‌ కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోరా డెత్‌ వారెంట్లు జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరేబియన్ దీవుల్లో నరమాంస భక్షకులు!