Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారానికి 90 గంటల పని చేయాలా? సన్‌డేను - సన్-డ్యూటీగా మార్చాలా?

Advertiesment
HarshGoenka

ఠాగూర్

, శుక్రవారం, 10 జనవరి 2025 (15:20 IST)
వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారం సెలవును కూడా వదిలివేయాలంటూ ఎల్ అండ్ టి చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. ఇదే అంశంపై పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ సెలెబ్రిటీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ కోవలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు. ఈ తరహా పని విధానం వినాశనానికేగానీ విజయానికి కాదంటూ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. 
 
'వారానికి 90 రోజుల పనా? సండేను సన్‌-డ్యూటీ అని.. 'డే ఆఫ్‌'ను ఓ 'ఊహాజనిత భావన' అని ఎందుకు మార్చకూడదు. కష్టపడి తెలివిగా పని చేయడంపై నాకు నమ్మకం ఉంది. కానీ, జీవితాన్ని శాశ్వతమైన ఆఫీసు షిప్టుగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయాన్ని తీసుకురాదు. వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్ అనేది ఆప్షన్‌ కాదు. అవసరం అని నా అభిప్రాయం' అని హర్ష్‌ గొయెంకా ట్వీట్ చేశారు. 'వర్క్‌ స్మార్ట్‌ నాట్‌ స్లేవ్‌' అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ప్రస్తుతం గొయెంకా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 
 
ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. ఎందుకో తెలుసా? 
 
రైలు ప్రయాణికుడుని రైల్వే అటెండర్ల సాయంతో టీటీఈ చితకబాదాడు. రైలు ప్రయాణంలో మద్యం సేవించి మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకుగాను టీటీఈ ఈ చర్యకు పాల్పడ్డాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే, రైలు ప్రయాణికుడుపై దాడికి చేసిన రైల్వే అటెండెంట్లు ప్రయాణికుడుతో కలిసి మద్యం సేవించి, చివరకు ప్రయాణికుడుని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన అమృతసర్ కతిహార్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రైలులో మద్యం సేవించి తోటి మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి.. ప్రయాణికుల ఫిర్యాదుతో అక్కడికి వచ్చిన టీటీఈని కూడా చెంపదెబ్బ కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన టీటీఈ, కోచ్ అటెండెంట్ తో కలిసి సదరు ప్రయాణికుడిని చితకబాదాడు. కిందపడేసి, శరీరంపైకెక్కి హింసించాడు. కోచ్ అటెండెంట్ బెల్ట్ తో కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, దగ్గర లంచం తీసుకున్నాడని, మద్యం తాగాడని ప్రయాణికులు ఆరోపించారు. అమృత్‌సర్ కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుందీ ఘటన.
 
పంజాబ్ రాష్ట్రానికి చెందిన షేక్ తాజుద్దీన్ బుధవారం అమృత్‌సర్ కతిహార్ ఎక్స్‌ప్రెస్‌లో బీహార్‌లోని సివన్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరాడు. రైల్వే కోచ్ అటెండెంట్లు విక్రమ్ చౌహాన్, సోను మహతోలకు లంచం ఇచ్చి తన సీటులోనే మద్యం సేవించాడు. తాజుద్దీన్‌తో కలిసి చౌహాన్, మహతో కూడా మద్యం సేవించారు. ఆ తర్వాత తోటి మహిళా ప్రయాణికులతో తాజుద్దీన్ అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో చౌహాన్ రైల్వే టీటీఈ రాజేశ్ కుమార్‌ను పిలిచాడు.
 
ఈ సందర్భంగా రాజేశ్ కుమార్‌తో వాగ్వాదానికి దిగిన తాజుద్దీన్.. కోపంతో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన రాజేశ్ కుమార్.. తాజుద్దీన్‌ను డోర్ వద్దకు లాక్కుని వెళ్లి చౌహాన్ సాయంతో దాడి చేశాడు. తాజుద్దీన్‌ను కిందపడేసి వీపుపై కూర్చోగా.. చౌహాన్ బెల్ట్‌తో చితకబాదాడు. తాజుద్దీన్ వీపుపై రాజేశ్ కుమార్ ఎగిరి దూకడం వీడియోలో కనిపించింది. ప్రయాణికులు సమాచారం అందించడంతో తర్వాతి స్టేషన్‌లో రైల్వే పోలీసులు టీటీఈని అదుపులోకి తీసుకున్నారు. చౌహాన్, మహతోలు పరారయ్యారు. రైలు మొత్తం వెతికినా దొరకలేదు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 10 నుండి భారత మార్కెట్లోకి OnePlus 13