Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హీరోయిన్‌తో డేటింగ్ చేశా : యువరాజ్ సింగ్

Advertiesment
yuvraj

ఠాగూర్

, శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (10:45 IST)
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను ఓ సినీ నటితో డేటింగ్‌ చేసినట్టు వెల్లడించారు. గత 2007-08 ఆస్ట్రేలియా పర్యటన సమయంలో డేటింగ్ చేసినట్టు చెప్పారు. మంకీ గేట్ వివాదం రాజు కొన్న సమయంలో యువీ డేటింగులో ఉన్నట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, 'గతంలో నేను ఓ సినీ నటితో డేటింగ్ చేశా. ఆమె షూటింగ్ కోసం అడిలైడ్‌లో వచ్చింది. మేం కాన్‌బెర్రాలో ఉన్నాం. 'ఆటపై దృష్టి పెట్టాలి. నువ్వు ఇక్కడకు రావద్దు'అని చెప్పా. నేను చెప్పినా వినకుండా ఆమె కాన్‌బెర్రాకు వచ్చేసింది. 'ఆమెను చూసి ఇక్కడేం చేస్తున్నావు?' అని అడిగా. 'నీతో సమయం గడుపుదామని వచ్చానని చెప్పింది. దీంతో ఆ రోజు ఆమెతోనే ఉండిపోయాన'ని యువీ తెలిపాడు. 
 
ఆ తర్వాత కాన్‌బెర్రా నుంచి అడిలైడ్ వెళ్లేందుకు సిద్ధం కాగా. తన సూట్‌కేస్‌ను ఆమె ప్యాక్ చేసిందని తెలిపాడు. అయితే, తన బూట్లను కూడా సర్దేయడంతో.. బయల్దేరే సమయానికి ఏం చేయాలో అర్థం కాలేదన్నాడు. 
 
అప్పుడు తను తన పింక్ షూను వేసుకొని వెళ్లమనడంతో.. తప్పలేదని యువీ చెప్పాడు. అమ్మాయిలు వేసుకొనే షూతోనే టీమ్ బస్సు దగ్గరకు వచ్చా. సహచరులకు కనిపించకుండా సూట్‌కేస్ అడ్డుపెట్టుకొన్నా.
 
కానీ, ఎలాగో వారి కంట పడడంతో.. చప్పట్లు కొడుతూ ఆటపట్టించారు. అయితే, ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం యువీ బయటపెట్టలేదు. ఆ హీరోయిన్ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేనే అంటూ జాతీయ మీడియాలో ప్రచారం సాగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

147 యేళ్ల క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా... శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్