Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమిలి ఎన్నికలు మంచి ఆలోచన : రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన మనసులోని మాటను వెల్లడించారు. ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు మద్దతునిచ్చేలా ఉన్నాయి. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో అంటే జమిలి ఎన్

Advertiesment
జమిలి ఎన్నికలు మంచి ఆలోచన : రజినీకాంత్
, ఆదివారం, 15 జులై 2018 (16:54 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన మనసులోని మాటను వెల్లడించారు. ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు మద్దతునిచ్చేలా ఉన్నాయి. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో అంటే జమిలి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన కృషి చేస్తున్నారు కూడా. ఈ జమిలి ఎన్నికలు మంచి ఆలోచన అంటూ వ్యాఖ్యానించారు.
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, జమిలి ఎన్నికలు చాలా మంచి ఆలోచన అని వ్యాఖ్యానించారు. 'వన్ నేషన్ వన్ పోల్' ఆలోచన మంచిదేనని, జమిలి ఎన్నికల వల్ల డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని, ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.
 
సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీ చేసే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. తమిళనాడు అవినీతి మయమైపోయిందని బీజేపీ నేత అమిత్ షా చేసిన ఆరోపణల విషయమై ప్రశ్నించగా, రజినీ స్పందిస్తూ అది అమిత్ షా అభిప్రాయమని, ఈ విషయం గురించి ఆయన్నే అడగాలని చెప్పారు. 
 
మరోవైపు, రజినీకాంత్ ప్రారంభించిన రజినీకాంత్ మక్కల్ మండ్రంలో సభ్యత్వం తీసుకునేందుకు మహిళలు పోటీపడుతున్నారు. ఫలితంగా ఈ మండ్రం సభ్యత్వ సంఖ్య ఇప్పటికే కోటిని దాటింది. కాగా, గత యేడాది డిసెంబరు నెలలో తన అభిమాన సంఘాలతో సమావేశమైన రజినీకాంత్.. ఈ మక్కల్ మండ్రాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#AskKTR : Who is best CM YSR or KCR : కేటీఆర్ చెప్పిన ఆన్సర్ ఏంటి?