Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#AskKTR : Who is the best CM YSR or KCR : కేటీఆర్ చెప్పిన ఆన్సర్ ఏంటి?

Whoi is best CM YSR or KCR.. ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. కేటీఆర్.. తక్కువేం తినలేదు కదా.. అందుకే ఆ నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ కూడా 'చిక్కడు-దొ

Advertiesment
#AskKTR : Who is the best CM YSR or KCR : కేటీఆర్ చెప్పిన ఆన్సర్ ఏంటి?
, ఆదివారం, 15 జులై 2018 (16:35 IST)
Whoi is best CM YSR or KCR.. ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ తనదైనశైలిలో సమాధానమిచ్చారు. కేటీఆర్.. తక్కువేం తినలేదు కదా.. అందుకే ఆ నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ కూడా 'చిక్కడు-దొరకడు' అన్న రీతిలో సమాధానమిచ్చారు. 'సమాధానం ఏమిటో మీకు తెలుసు' అంటూ ఆ నెటిజన్ ప్రశ్నకు ఆన్సర్ చేశారు.
 
కేటీఆర్ ఇచ్చిన ఈ సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చాలా మంది ఆ ప్రశ్నకు 'ఇంకెవరు.. కేసీఆరే' అంటూ కామెంట్ చేశారు. కేటీఆర్ గొప్పగా సమాధానం చెప్పారని కొందరు అంటే.. ఆ ఇద్దరినీ పోల్చలేమంటూ మరికొందరు అంటున్నారు. అయితే, తెలంగాణాకు చెందిన నెటిజన్లు కేసీఆర్‌కు బదులిస్తే, ఏపీకి చెందిన నెటిజన్లు మాత్రం వైఎస్ఆర్ అని ఠక్కున సమాధానమిచ్చారు.
 
అదేసమయంలో 2019 ఎన్నికల్లో తాను సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం (జూలై-15) ట్విటర్‌‌లో నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. ఆస్క్‌ కేటీఆర్‌ యాష్‌ ట్యాగ్‌తో (#AskKTR) ఆయనకు ట్యాగ్‌ చేస్తూ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. కొన్ని సరదా ప్రశ్నలు.. కొన్ని సీరియస్‌ ప్రశ్నలు.. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ పనితీరుపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులు ఇచ్చారు. 
 
వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ కొందరు నెటిజన్లు కోరారు. 2024 ఎన్నికల్లో ఏపీలో టీఆర్ఎస్ పోటీ చేసే అవకాశముందా అని గుంటూరు వ్యక్తి ప్రశ్నించగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమంటూ పేర్కొన్నారు.
 
ఇకపోతే, ఆదివారం జరిగే సాకర్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఎవరూ గెలుస్తారని కేటీఆర్‌‌ను ప్రశ్నించగా.. ఎవరు గెలిచినా ఆనందమేనంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు కేటీఆర్‌ కూడా సరదా సరదాగా సమాధానం ఇచ్చారు. మీకు నచ్చిన బీర్‌ ఏది అని ఓ నెటిజన్‌ అడుగగా.. ఆ విషయం చెప్పను అంటూ కేటీఆర్‌ బదులిచ్చారు. అమ్మాయిల ప్రశ్నలకు మీరు రిప్లై ఇవ్వడం లేదంటూ ఓ యువతి ప్రశ్నించగా.. ఎంత ధైర్యం నాకు అంటూ కేటీఆర్‌ బదులిచ్చారు. 
 
మీ ఫేవరేట్‌ ఫుట్‌బాలర్‌ ఎవరు అని అడిగితే.. మెస్సీ అని బదులిచ్చిన కేటీఆర్‌.. మీకు ఇష్టమైన కమెడియన్‌ ఎవరు అని ప్రశ్నిస్తే.. రాజకీయల్లో అడుతున్నావు కదా అని దాటవేశారు. తదుపరి ముఖ్యమంత్రి కేసీఆరేనని స్పష్టం చేసిన కేటీఆర్‌.. మోడీ, రాహుల్‌ గాంధీలో ఎవరిని ఎంచుకుంటారంటే.. ప్రశ్నను ప్రశ్నగానే వదిలేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో కేటీఆర్‌.. మరీ ఆంధ్రలో ఎవరు? అని ప్రశ్నిస్తే.. కాలేజీని వీడగానే ఖాళీలు పూరించడం ఆపేశానంటూ బదులిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోరున ఏడ్చేసిన కన్నడ ముఖ్యమంత్రి కుమారస్వామి? ఎందుకు?