Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగం పోతుందనే భయంతో పసికందును కెనాల్‌లో విసిరేసిన తండ్రి... ఎక్కడ?

new born baby
, మంగళవారం, 24 జనవరి 2023 (13:31 IST)
రాజస్థాన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులంటూ ప్రకటించింది. దీంతో ఇటీవల మూడో బిడ్డకు జన్మనిచ్చిన ఓ ప్రభుత్వ ఉద్యోగి... ఖచ్చితంగా ప్రభుత్వ విరమణ చేయాల్సివస్తుందన్న భయంతో తన మూడో పసికందును మురికి కాలువలో పడేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ముగ్గురు పిల్లలను కలిగివున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హరత కోల్పోతారని ప్రకటించింది. పైగా, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బికనీర్‌కు చెందిన జవార్ లాల్ మేఘ్వాల్ ఓ కాంట్రాక్టు ఉద్యోగి. రేపో మాపో తనలాంటి ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా, ఈయన భార్య ఇటీవలే మూడో బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ముగ్గురు పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనతో తనకు ఉద్యోగం పోతుందని ఆందోళన చెందారు. దీంతో భార్యతో కలిసి చర్చించి మూడో బిడ్డను వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆపై ఆ పసికందును తీసుకుని వెళ్లి ఛత్తార్‌గఢ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ కెనాల్‌లో పారేసి వచ్చారు. నెలల పసికందు మరణానికి కారణమైన ఆ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన ఇద్దరినీ అరెస్టు చేసి విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. తేదీల వారీగా సర్చ్ చేసుకోవచ్చు..