Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎంత గొప్ప మనసు... తల్లికి రెండో పెళ్లి చేసిన కన్నబిడ్డ.. ఎక్కడ?

marriage
, మంగళవారం, 24 జనవరి 2023 (12:44 IST)
ఆ బిడ్డది ఎంత గొప్ప మనసు. భర్తను కోల్పోయి గత 25 యేళ్లుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న తల్లికి కన్నబిడ్డ దగ్గరుండి రెండో పెళ్లి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన యువరాజ్ షేలే అనే 23 యేళ్ల యువకుడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి తల్లి తన కోసం ఒంటరిగానే జీవిస్తుంది. నాటి నుంచి షీలేనే కుటుంబ బాధ్యతలు అన్నీ చూసుకుంటున్నాడు. కానీ తన తల్లికి ఒక మంచి తోడు అవసరమని గ్రహించాడు. తన తండ్రి మరణించిన నాటి నుంచి ఆమె ఇంట్లోనే ఒంటరితనాన్ని అనుభవిస్తూ జీవిస్తుంది. పొరుగువారితో కూడా ఎలాంటి సంబంధాలు లేకుండా ఇంట్లోనే ఒంటిరిగా ఉండసాగింది. ఇది ఆ యువకుడి మనసును కలిచివేసింది. ఆమె బాధను తొలగించాలనే ఉద్దేశంతో తల్లికి రెండో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఈ విషయం తెలిసిన ఇరుగుపొరుగువారు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా తనను దూషించినా ఏమాత్రం పట్టించుకోలేదు. తన స్నేహితులు, బంధువుల సాయంతో తన తల్లికి పెళ్లికొడుకు వెతకసాగాడు. ఈ క్రమంలో మారుతి అనే వ్యక్తి తన తల్లికి సరైన వరుడని భావించి సమీప బంధువుల ద్వారా వివరాలు సేకరించాడు. తల్లితో చర్చించిన తర్వాత పెళ్లి ఏర్పాట్లు చేశాడు. ఈ రోజు నా జీవితంలో చాలా ప్రత్యేమైన రోజు. నా తల్లికి ఒక తోడును చూసే బాధ్యత నేను తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 
 
ఈ విషయంపై ఎన్నో సంప్రదాయక భావాలున్న మా స్థానిక కొల్హాపూర్ వాసులను, బంధువులను ఒప్పించడం అంత సులభమైన పనికాదు. ఈ విషయంలో నేను విజయం సాధించాను. తన తల్లి ఒంటరితనాన్ని తొలగించాలన్న ఆలోచనతో ఆమెకు మళ్లీ పెళ్లి చేశాను. 40 యేళ్ళ కన్నతల్లికి రెండో పెళ్లి చేసిన ఆ యువకుడు తనలోని గొప్ప మనస్సును చాటుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ కోర్టులో 'పరువు' పోయింది... అడ్డూఅదుపులేని పరువు హత్యలు