దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. దీంతో సినీ ఇండస్ట్రీలో పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపులను అనేక మంది హీరోయిన్లు బహిరంగంగా వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రివరకు ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు పంపించారు. చాలా అందంగా ఉన్నావ్.. ఒక్కసారి రారాదూ అంటూ పేర్కొన్నారు.
ఈ సందేశాన్ని చూసిన ఆ మహిళా అధికారికి ఖిన్నురాలైంది. అసభ్య సందేశం పంపించింది ఓ మంత్రి అనికూడా చూడకుండా ఏకంగా ముఖ్యమంత్రి అమరీదర్ సింగ్ దృష్టికి తీసుకెళ్ళింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి అమరీందర్ సింగ్... మంత్రిని పిలిచి మందలించారు. అంతేకాకుండా, మహిళా అధికారిణికి క్షమాపణలు చెప్పి సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
దీంతో మంత్రి మహిళా అధికారిణికి క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. అయితే, ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో మీడియాలో కథనాలు వచ్చాయి. మహిళా అధికారిణిని అభ్యంతరకరమైన సందేశాలతో వేధించిన పంజాబ్ రాష్ట్ర మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు డిమాండ్ చేశారు.