Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య బరువు పెరిగిందనీ ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు.. ఎక్కడ...

భార్య బరువు పెరిగిందనీ ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు.. ఎక్కడ...
, గురువారం, 25 అక్టోబరు 2018 (08:59 IST)
దేశంలో ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం ఓ ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొచ్చింది. దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేశారు. కానీ, ముస్లిం వర్గానికి చెందిన భర్తలు ఈ చట్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను కాలరాస్తూ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. కారణం ఏంటో తెలుసా... భార్య బరువు పెరిగందని ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జాబువా జిల్లాలో వెలుగుచూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జాబువా జిల్లా మేఘానగర్ షీరానీ మహల్లాకు చెందిన ఆరిఫ్ హుసేన్, సల్మాబానోను పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. తాను బరువు పెరిగి లావుగా ఉన్నానని తన భర్త ఆరిఫ్ హుసేన్ తనను రోజూ కొడుతుండేవాడని భార్య సల్మాబానో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తనకు భర్త ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని సల్మాబానో పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ముస్లిం మహిళల రక్షణ, కొత్త వివాహ చట్టం 2018 అమలులోకి వచ్చాక తనకు చట్టవిరుద్ధంగా భర్త ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని సల్మా చేసిన ఫిర్యాదు మేర మేఘానగర్ పోలీసులు భర్త ఆరిఫ్ పై ఐపీసీ సెక్షన్ 323, 498 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ట్రిఫుల్ తలాఖ్ ఇచ్చిన భర్త ఆరిఫ్ హుసేన్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించామని పోలీసు అధికారి కుషాల్ సింగ్ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో 20 సంస్థలకు 126 ఎకరాల కేటాయింపు...