అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణకు ధర్మాసనం జీవితఖైదుతో పాటు.. రూ.5లక్షలు జరిమానా విధించింది. దీంతోపాటు రూ.7లక్షలు బాధితురాలికి ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు ప్రజ్వల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది మే 21న అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆగస్ట్ 2024లో ప్రజ్వల్ రేవణ్ణపై చార్జ్‌షీట్ దాఖలయ్యింది.
హాసన్‌లోని గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో 2021 కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రజ్వల్ తనపై రెండు సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను కిడ్నాప్ చేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు అతనని అరెస్ట్ చేశారు. గత 14 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలోనే ప్రజ్వల్ ఉన్నాడు. ప్రస్తుతం అతనికి జీవితఖైదు విధించడం జరిగింది.