Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియాను భారత్‌గా మార్చాలా? అయితే, వినతి పత్రం ఇవ్వు : సుప్రీం

Advertiesment
ఇండియాను భారత్‌గా మార్చాలా? అయితే, వినతి పత్రం ఇవ్వు : సుప్రీం
, బుధవారం, 3 జూన్ 2020 (17:29 IST)
ఇండియాను భారత్‌గా మార్చాలని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. భార‌త్ అన్నా.. లేక ఇండియా అన్నా ఒక్క‌టే అని, ఆ రెండు పేర్ల‌ను రాజ్యాంగంలో చేర్చార‌ని, రాజ్యాంగం ప్ర‌కారం కూడా ఇండియాను భార‌త్ అని పిలుస్తార‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే తెలిపారు. వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో సాగిన కోర్టు విచార‌ణ‌లో ఆయ‌న ఈ తీర్పునిచ్చారు.
 
ఇండియా పేరును భార‌త్‌గా మార్చాల‌ని కోరుతూ న‌మ‌హా అనే వ్య‌క్తి పిటిషన్ దాఖలు చేశారు. ఇండియాను పేరును విదేశీయులు పెట్టార‌ని, గ్రీకు కాలంలోనూ మ‌న దేశాన్ని ఇండికా అని పిలిచేవార‌ని పిటిష‌న్‌లో తెలిపారు. భార‌త్ అనే ప‌దం మ‌న స్వాతంత్య్ర స‌మ‌రానికి ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని, మార‌త్ మాతాకీ జై అని నినాదాలు చేసిన‌ట్లు కౌన్సిల్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 1ని స‌వ‌రించాల‌ని, ఆ ఆర్టిక‌ల్ నుంచి ఇండియాను తొల‌గించాల‌ని పిటిష‌న్‌లో కోరారు.
 
దీనిపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. దేశం పేరును భార‌త్‌గా మార్చాల‌న్న పిటిష‌న్‌ను ఓ ప్ర‌తిపాద‌న‌గా త‌యారు చేసి.. దాన్ని కేంద్ర ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోర్టు పిటిష‌న్‌దారుడికి సూచించింది. కేంద్ర ప్ర‌భుత్వం ఈ అంశంపై స‌రైన నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని కోర్టు అభిప్రాయపడింది. భార‌త్ అన్నా.. లేక ఇండియా అన్నా ఒక్క‌టే అని, ఆ రెండు పేర్ల‌ను రాజ్యాంగంలో చేర్చార‌ని, రాజ్యాంగం ప్ర‌కారం కూడా ఇండియాను భార‌త్ అని పిలుస్తార‌ని సీజేఐ బోబ్డే తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ ఆ కాలంలో ఎక్కువగా వస్తుందట