Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'రాష్ట్రపత్ని' పై లోక్‌సభలో రగడం - ముగ్గురు ఎంపీల సస్పెన్షన్

Advertiesment
women mp's
, గురువారం, 28 జులై 2022 (14:18 IST)
కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని రాష్ట్రపత్నిగా సంభోదించారు. ఈ వ్యాఖ్యలు ఉభయ సభల్లో పెను దుమారాన్ని రేపాయి. 
 
రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. 
 
దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి గిరిజనురాలైన ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్‌ మొదటి నుంచి అవమానిస్తోందని ఆరోపించారు. 'దేశంలో గిరిజనులందరినీ అవమానించారు'. 
 
గురువారం లోక్​​సభ ప్రారంభం కాగానే.. దేశ రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానపరిచిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే ఆ అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. దీనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కౌంటరిచ్చారు. ఇప్పటికే అధీర్‌.. క్షమాపణలు చెప్పారన్నారు. 
 
అదేవిధంగా ముర్ముపై  అధీర్​ చేసిన వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. ధరల పెరుగుదలపై కాంగ్రెస్​ ఎంపీలు.. ప్లకార్డులు పట్టుకుని ఛైర్మన్​ వెల్​లోకి దూసుకెళ్లారు. ఆ చర్యను రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. ఆందోళనలు చేపడుతున్న ఎంపీలు సభ నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. కానీ ఏ ఎంపీ పేరును ఆయన చెప్పలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చదివించరనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య